నా బుజ్జి

నా బుజ్జి

నేనెవరో……
నీకు ఎరుక లేదే …!
ఓ,
నా బుజ్జి………..!

నేను
వెచ్చని సూర్యకిరణాన్నయ్
నిన్ను తాకి
సుర్రుమనిపిస్తా…..!
నీవు
ఆనంద డోలికల్లో
పిండి పదార్థాలు
వండుకునెదవే
ఓ,
నా బంగారు తల్లి…..!

చల్లని గాలినై
నీకు చామరలు పట్టేదనే.
నీ ఉక్క పోత
హడలి పారిపోవునే
ఓ, నా లేత మొక్క……..!

వర్షపు చినుకునై
నిను ముద్దాడుదునే.
నీకు పరిమళాలతో
ముఖమజ్జనమే నే ….!
ఓ, నా చిట్టి దళమా…..!

నిన్ను కదలనీకుండా
ఒడిసి పట్టుకుంటా
భూమాత వలె.
తల్లి ప్రేమ దక్కునే
నీకు
ఓ, నా వజ్రపుమూట …!

నీ,
అవసరం ఏట్లో
అట్లే ఎత్తెద
నా అవతారము.

నేనెవరో
నీకు ఎరుక లేదే…!
ఓ,
నా బుజ్జి………..!

– వాసు

Related Posts