నా డైరీ చిత్రం

నా డైరీ చిత్రం

చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చిన నాకు ఊరంతా మారినట్టు అనిపించింది. అదంతా మామూలే కదా అనుకుంటూ ఇంటి వైపు నడుస్తున్నాను. మధ్యలో తెలిసిన వాళ్ళు నవ్వుతూ పలకరిస్తున్రునా. కొందరు అయితే గుర్తు పట్టనే లేదు నేనే వారిని పలకరించడంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.

అలా అందర్నీ పలకరిస్తూ ఇంటికి వెళ్ళాను. అమ్మ ఎదరై ఎమ్మా ఇదేనా రావడం పిల్లలు, అల్లుడు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలయ్యాక లోపలికి తీసుకుని వెళ్లి, ఎప్పుడు తిన్నావో ఏమిటో అంటూ తల్లి మనసుతో అన్నం వడ్డించింది.

అన్నం తింటున్న నాతో ఏంటమ్మా సంగతులు ఇలా హఠాత్తుగా వచ్చావు అంటూ అరాలు తీసింది. ఏమైనా గొడవ పడి వచ్చాను అనుకుందేమో…! దానికి నేను నవ్వుతూ లేదమ్మా ఊరికే మిమల్ని చూసి పోదామని వచ్చాను అంటూ చెప్పి తినడం ముగించాను. సరే అలసి పోయి ఉంటావు కాసేపు పడుకో అంది అమ్మ. సరేనంటూ నా గది లోకి వెళ్ళాను.

అవును ఇది నా గది. చిన్నప్పుడు నాన్న నాకు ప్రేమగా కట్టించిన గది. ఆ గది ఇప్పటికీ ఎంతో శుభ్రంగా ఉంది. లోనికి వెళ్లి మంచం పై వాలాను కానీ నిద్ర రాలేదు. కాసేపు అటూ ఇటుగా పొర్లి చివరికి నిద్ర రక నా చిన్నప్పుడు వచ్చిన బహుమతులు అన్ని ఒకసారి చూసుకోవాలి అనిపించిం లేచి అన్నీ చూడడం మొదలు పెట్టాను.

పాటల పోటీల్లోనూ, నృత్య పోటీలలో, ఆటల పోటీలలో నాకు వచ్చిన ఎన్నో బహుమతులను చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. సెల్ ఫుల్ అడుగుభాగాన ఒక మెరుస్తున్న పుస్తకం కనిపించింది. దాన్ని చూడగానే నాకెంతో ఆనందం కలిగింది.

అది నా పదో పుట్టినరోజుకు మా నాన్నగారు నాకు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా చిన్న డైరీ. అందమైన పువ్వు తో కాఫీ కలర్ రంగులు కొంచెం దుమ్ము కొట్టుకుపోయినా అందంగా కనిపించింది. దాన్ని తీసి తుడిచాను. ఒక్కో పేజీ తిప్పుతున్నాను.

అంతటి అందమైన డైరీలో అందంగా నా పేరు చూసుకుని ఒక్కసారి నా పేరు నేను ముద్దుపెట్టుకున్నాను. మొదటి బహుమతి ఎవరికైనా అపురూపమే కదా, అందులోనూ నాన్నగారు ఇచ్చారంటే ఇంకా ఆనందం.

నాన్న నాకు ఆ డైరీ ఇస్తూ, “అమ్మా ప్రతిరోజూ నీకు జరిగిన అనుభవాలు ఇందులో రాసుకో ఆ మరుసటి రోజు దీన్ని నువ్వు చదువుకుంటే నువ్వు చేసిన తప్పులు ఏమిటి అనేవి మీకు తెలుస్తాయి దానివల్ల నువ్వు వాటిని సరి చేసుకోవచ్చు” అని చెప్పిన ఆ మాటలు నా చెవుల్లో ఇంకా ఉన్నాయి

ఒక్కో పేజీ తిప్పుతున్నాను నా 11 వ సంవత్సరం నుంచి ఆ రోజు స్కూల్ లో ఏం జరిగింది, నా స్నేహితులతో ఏం మాట్లాడాను, ఎవరితో తప్పుగా ప్రవర్తించాను వారి తప్పు లేకుండా నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను అనేది స్పష్టంగా రాసి పెట్టుకున్నాను.

దీని వల్లే నేను ఆ మరుసటి రోజు నా స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి తనకి క్షమాపణలు చెప్పి మళ్ళీ ఇద్దరం కలిసి పోయాం. డైరీ పేజీలు తిప్పుతూ ఉన్న సమయంలో ఒక పేజీ దగ్గర నా కళ్ళు ఆగిపోయాయి.

అక్కడ పెన్సిల్ తో నేను వేసిన ఒక అందమైన యువకుని చిత్రం నాకు కనిపించింది. పదవ తరగతిలో నాతో పాటు చదువుకున్న అబ్బాయి. అతన్ని మొదటి సారి క్లాసులో చూసినప్పుడే నేను అతనికి ఆకర్షితురాలు అయ్యాను. నా హృదయమంతా తననే నింపుకున్నాను. దాని ఫలితమే డైరీలో బొమ్మ వేయడం.

అతన్ని ఎంతగా ఆరాధించాను అంటే రోజూ అతని కోసం నా కళ్ళు వెతికేవి. అతను ఒక్క రోజు పాఠశాలకు రాకపోయినా నాకు ఎంతో వెలితిగా ఉండేది. అన్నం సాయం చేసేది కాదు. ఇంత ఆరాధిస్తున్నా నేను అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు.

కేవలం చూపులే తప్ప మా మధ్య మాటలు లేవు. కొన్నాళ్ళ తర్వాత అతను కూడా నన్ను చూడడం మొదలు పెట్టాడు. మా కళ్ళు మాట్లాడుకున్నవేమో ఆ విషయం కూడా నాకు తెలియదు అప్పట్లో అది ప్రేమ అని నేను అనుకున్నాను కానీ అది ఆకర్షణ అని నాకు కొన్నాళ్ల తర్వాత తెలిసింది. అది ఎలా జరిగిందంటే….

ఒక రోజు నేను డైరీ రాస్తూ రాస్తూ అలాగే నిద్రపోయాను. ఆ సమయంలో నాన్న గారు నా గదిలోకి వచ్చారు నన్ను మంచంపైన పడుకోబెట్టి డైరీ చూశారు. ఆ మరుసటి ఉదయం స్కూలుకు వెళుతున్న నన్ను పిలిచి ఒకే ఒక మాట చెప్పారు.

అమ్మా ఇప్పుడు నీకు ప్రపంచం అందంగా కనిపించవచ్చు కానీ మెరిసేది అంతా బంగారం కాదు తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని అనుకునే వయసు నీది. అందువల్ల ఇప్పుడు నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కాబట్టి నీకు నువ్వే ఆలోచించుకో…

చదువుపై దృష్టి పెడతావో లేదా ఆకర్షణలో నీ జీవితాన్ని కోల్పోతావో నీ ఇష్టానికే వదిలేస్తున్నా అని ఆయన ఎంతో బాధ్యతగా నాకు చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది నాన్నగారు నా డైరీ చదివారు అని.

దాంతో నేను నాన్నకి ఇష్టం లేని పని చేయకూడదని నిర్ణయించుకున్నాను అందువల్ల అతడి వైపు చూడడం మానేసి నా చదువుపై దృష్టి పెట్టాను. పదోతరగతి అయిపోయిన తర్వాత వేరే ఊర్లో కాలేజీలో చేరాను. అక్కడ కూడా బాగా చదువుకొని మంచి మార్కులతో పాసయ్యాను..

ఆ తర్వాత నేను అనుకున్నట్లుగా డాక్టర్ కోర్సు చదవడం డాక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించడం నా చదువులో పడి అతని విషయమే మర్చిపోయాను. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని నా పుట్టింటికి వచ్చిన నేను ఆ చిత్రాన్ని చూస్తూ అలా ఎంత సేపు ఉన్నానో తెలియదు.

ఇంతలో అమ్మ వస్తూ, వసు, వసూ ఇదిగో మీవారు ఫోన్ చేస్తున్నారు అంటూ నా గదిలోకి వచ్చింది. దాంతో గబుక్కున డైరీ మూసేశాను. ఫోన్ తీసుకొని మాట్లాడుతూ బాగానే చేరానండీ, క్షేమంగానే వెళ్లాను అంటూ ఆయన తో మాట్లాడుతున్నాను.

ఆ పక్కన ఉన్న డైరీ అమ్మ చూసినట్టుంది దాన్ని పేజీలు తిప్పుతూ ఉంది అతని ఫోటో దగ్గర ఆగిపోయింది. నా ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత అమ్మ నాతో, అమ్మ దొంగా… నా కడుపున పుట్టి నువ్వు ఎంత ఆరితేరి పోయావే. నీది ఆకర్షణ కాదు నిజమైన ప్రేమని అతని పెళ్లి చేసుకుని మా అందరికీ నిరూపించావు.

అసలు ఇంత కథ ఎప్పుడు నడిపించావు అంటూ అడిగింది. నేను నా డైరీలో గీసిన బొమ్మలు సగమే గీశాను అందువల్ల నాన్న పెళ్లి చూపులకు వచ్చిన అతన్ని గుర్తు పట్టలేకపోయారు. అలా ప్రేమించుకున్న మేము పెద్దల అంగీకారంతో ఎవరినీ నొప్పించకుండా పెళ్లి చేసుకున్నాం.

ఎంతైనా మొదటి ప్రేమ న్యూస్ అర్థం చేసుకునేది ఏ కొందరు ఆ కొందరిలో నేను ఒక దాన్ని అవ్వడం నా అదృష్టం. ప్రేమించే భర్త ముచ్చటైన ఇద్దరు పిల్లలు ఇప్పుడు నా ఆస్తి. అమ్మకు ఏమి చెప్పకుండానే చిన్నగా చిరునవ్వు నవ్వి పక్కనే ఉన్న పెన్సిల్ తీసుకున్నాను ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి.

వయస్సులో ఆకర్షణకు ఎవరైనా గురవుతారు ఆకర్షణ ప్రేమ అనుకోని తప్పటడుగులు వేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటారు వారి జీవితాలనే కాకుండా వారి కుటుంబ జీవితాలను కూడా నవ్వుల పాలు చేస్తారు.

అలా కాకుండా బాగా చదువుకొని నిజమైన ప్రేమికులు అయితే పెద్దలను ఒప్పించి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఉత్తమం. అప్పుడు పెద్దలు ఒప్పుకుంటారు కాబట్టి ఏ సమస్యలు వచ్చినా వాళ్ళే చూసుకుంటారు.

నిజమైన ప్రేమ అంటే ఇదే. డైరీలో చిత్రం గీయడం పూర్తయింది. ఈ చిత్రాన్ని ఒకసారి గట్టిగా గుండెలకు హత్తుకుని ఫోన్ తీసి వాట్సప్ లో ఆయనకి పంపించాను. అసలు దీని కోసమే కదా నేను ఇంత దూరం వచ్చింది.

నేను పదో తరగతి లోనే నీ గురించి ఈ చిత్రాన్ని గీసాను అంటే ఆయన నమ్మలేదు అందుకే చూపించడానికి ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఆ చిత్రాన్ని పూర్తి చేసి ఆయనకి పంపించాను. ఆయన దానికి రిప్లయ్ గా థాంక్యూ మై లవ్ అంటూ చిరునవ్వుతో మురిసిపోయాను.

– అర్చన

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress