నా ఫస్ట్ లవ్ స్టొరీ
అది ఒక అందమైన అపార్ట్మెంట్ అందులో అందరు ఒక కుటుంబంలో కలిసి ఉన్నట్టు ఉంటారు. పసి పిల్లలు అల్లర్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ అపార్ట్మెంట్ అందులో 5వ క్లాస్ చదివే అబ్బాయి అదే అపార్ట్మెంట్ లో 5 వ క్లాస్ చదివే అమ్మాయి స్కూల్లో అబ్బాయి ఎప్పుడు చూసిన అమ్మాయి దగ్గరే కూర్చునేవాడు. ఏదన్నా ప్రాబ్లెమ్ వస్తె అమ్మాయితోనే షేర్ చేసుకునే వాడు.
ఇంకా చెప్పాలంటే అమ్మాయి నీ వదిలి ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు. అలా స్కూల్ చదువు పూర్తి అయ్యాక అమ్మాయిని కలవలేదు ఇంకెప్పుడు. అనుకోకుండా ఒక రోజు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు .కానీ అమ్మాయితో మాట్లాడలేకపోయాడు. తర్వాత మళ్లీ ఇంకెప్పుడు కలవలేదు వాళ్ళిద్దరూ. ఒక రోజు నాకు తెలిసింది ఆ అమ్మాయి కి పెళ్లి అయిపోయింది అని. అలా తన ఫస్ట్ లవ్ లో అబ్బాయి తన ప్రేమ నీ చెప్పలేక ఫెయిల్ అయ్యాడు.
ఇంతకీ వాళ్ళ పేర్లు చెప్పలేదు కదు, అబ్బాయి పేరు సుశాంత్
అమ్మాయి పేరు అశ్విని
ఇది నేను అనుభవించిన రియల్ స్టోరీ
– భరద్వాజ్