నా నమ్మకం గెలిచింది

నా నమ్మకం గెలిచింది

 నా నమ్మకం గెలిచింది

అమ్మ నేను నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్తున్నాం. రెండు రోజులు తర్వాత ఇంటికి వస్తాను” అని చెప్పాడు గణేష్.
“సరే… త్వరగా వచ్చేయండి” అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చింది పద్మ.
“అమ్మ నాన్న ఎక్కడ కనిపించట్లేదు” అని అడిగాడు గణేష్.

“పొలానికి మందులు కొనడానికి తక్కువ వెళ్లారు పక్క ఊరు వెళ్లారు” అని చెప్పింది పద్మ.
“సరే అమ్మ నేను ఇంకా వెళ్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు గణేష్.

“గణేష్ తన ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్ళాడు” బాలాజీకి చెప్పింది పద్మ.

హా! అవును… నాకు నిన్న రాత్రి చెప్పాడు గణేష్ కి జాగ్రత్తలు చెప్పి , డబ్బులు కూడా ఇచ్చాను” అని చెప్పాడు బాలాజీ.

“హా… మీరు డబ్బులు ఇచ్చారా గణేష్ కి, అదేంటి నా దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు.  మీరు డబ్బులు ఇచ్చారని నాకు అసలు చెప్పనేలేదు” గణేష్ అని చెప్పింది పద్మ.

“సర్లే… కానీ మనం ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేశాం. ఇంకా వీడొక్కడే లైఫ్ లో సెటిల్ అయితే మనం ప్రశాంతంగా ఉండొచ్చు” అని చెప్పాడు బాలాజీ.

“అవునండి… మీరు చెప్పిన కూడా కరెక్టే పిక్నిక్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఏదో ఇంటర్వ్యూ ఉందంట ఆ ఇంటర్వ్యూ కి వెళ్తానని అన్నాడు” అని చెప్పింది పద్మ.

రెండు రోజుల తర్వాత గణేష్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు.“ఏంట్రా… ఇలా వచ్చారు గణేష్ ఎక్కడ ఉన్నాడు కనిపించడం లేదు” అని అడిగాడు బాలాజీ.

“అది అంకుల్… పిక్నిక్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక  చెరువులోకి ఈతకి వెళ్ళాము. అక్కడ అందరం ఈత కొడుతుండగా గణేష్ గల్లంత అయిపోయాడు. మేము ఎంత వెతికినా కనిపించలేదు” అని కొంచెం కంగారుగా చెప్పాడు సురేష్.

లోపల నుండి వస్తున్న పద్మ ఈ మాటలు విని అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది.పద్మ ని మెల్లగా  తీసుకెళ్ళు రూమ్లో పడుకోబెట్టాడు బాలాజీ.

“అందరూ కలిసే వెళ్లారు కదా. గణేష్ గల్లంతైపోవడం ఏంట్రా నాకేం అర్థం కావడం లేదు. మళ్ళి ఒకసారి వెళ్లి వెతకండి రా “అని ఏడుస్తూ చెప్పాడు బాలాజీ.

బరువైన గుండె గాయంతో బాలాజీ , పద్మ బాధపడుతూ రోధిస్తున్నారు.కానీ పద్మ కి మాత్రం ఏదో మూల నమ్మకం ఉంది.

తన కొడుకు చనిపోలేదు , తన దగ్గరికి త్వరలోనే వస్తాడు అని నమ్మకంతోనే ఉంది.
ఆ నమ్మకంతోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ నమ్మకంతోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెతుకులాట సాగిస్తున్నారు.

రెండు సంవత్సరాల తర్వాత గణేష్ ఇంటికి వచ్చాడు.అది చూసి పద్మ , బాలాజీ తన ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు.

“మేము ఎంత వెతికిన నువ్వు దొరకపోయేసరికి నువ్వు ఇంకా లేవు రాలేవు అనుకున్నాము. కానీ నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడున్నావ్?” అని అడిగాడు సురేష్.

నేను అలా కొట్టుకొని వచ్చేసి స్పృహ కోల్పోయాను ఎవరో పడవ నడిపే అతను నన్ను చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ నేను కోల్కున్నప్పుడు, నేను గతం మర్చిపోయాను. కొన్నాళ్ళు తర్వాత నాకు గతం గుర్తొచ్చింది ఇప్పుడు వచ్చాను” అని చెప్పాడు గణేష్.

” మీరు చూశారా… నా నమ్మకమే గెలిచింది “అని ఎంతో ఆనందంతో పద్మ చెప్పింది.

అవునంటీ మీ నమ్మకమే గెలిచింది. గణేష్ వస్తాడని మేము అనుకోలేదు” అని చెప్పాడు సురేష్.
ఇలా ఈత కెళ్ళి చాలామంది గల్లంతయిపోయి, వాళ్ళ తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు.

వాళ్ళు బతికే ఉన్నారని చెప్పడానికి వీలు లేదు. చచ్చిపోయారు అని చెప్పడానికి వీలు లేకుండా ఉంటారు.

కానీ ఈతకి వెళ్ళినప్పుడు మీరు మాత్రం జాగ్రత్త.అన్నిసార్లు మన నమ్మకమే గెలుస్తుంది అని అనుకోవడం పొరపాటు.

 

-మాధవి కాళ్ల

బహుముఖ ప్రజ్ఞాశాలి Previous post బహుముఖ ప్రజ్ఞాశాలి
గాయపడిన హృదయం Next post గాయపడిన హృదయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close