నా ప్రయాణం

 నా ప్రయాణం

ఓ అక్షరమా… నాలో ఉన్న ఆవేదనను అర్థం చేసుకొని ,
అక్షరంతో నా ప్రయాణం సాగిస్తూ ,
నా ఉద్వేగాలను అక్షరంతో పంచుకుంటూ ,
ఆ అక్షరంతో నా ప్రతి ఆవేదనని ముడి వేసుకుంటూ ,
అక్షరమా ఓ అక్షరమా నాతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ ,
నాలో అంతర్లీన అక్షర కళ నేర్పుతూ,
అక్షరం అనే అంతస్తుని ఎక్కడానికి ,
నా వంతు ప్రయత్నం చేస్తూ ,
ఈ కళలో కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ ,
నేను రాసే భావాలకు అర్థం తెలుసుకుంటూ ,
నా భావాలను అక్షరంతో తెలియజేస్తూ ,
పట్టరాని ఆనందం వస్తే అక్షరంతో పంచుకుంటూ ,
బాధ కలిగితే అదే అక్షరంతో జత కలుపుతూ ,
నా నవ్వుకు కారణమైన వాళ్ళని అక్షరంతో తలుచుకుంటూ ,
అక్షరమా ఓ అక్షరమా నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ,
కన్నీళ్లను అక్షరతో పంచుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నా..
జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి అక్షరంతో మొదలైన నా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది..

 

 

-మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *