నా ప్రేమకథ

నా ప్రేమకథ

నా ప్రేమకథ

నా ప్రేమకథ
నా ప్రేమకథ

♥️♥️️♥️♥️♥️♥️♥️♥️♥

అటు నువ్వే ఇటు నువ్వే

ఏ వైపు చూసినా నువ్వే

మనసంతా నువ్వే

నా మనసులో ఉంది నువ్వే

నీతో పరిచయం స్నేహమై

ఆప్యాయత అనుబంధమై’

నా అనురాగం నువ్వేయి

నా అనురాగ దేవత నువ్వేయి,

నా హృదయంలో నిలిచిపోయి

చెదరని బొమ్మవయి నా హృదయంలో

పదిలమయి నిలిచిపోయావు

నీతో ప్రేమలో పడ్డాను’

అవును ప్రేమలో

పడిపోయాను

మునిగిపోయను,

ప్రేమసాగరంలో ఈదుతున్నాను

ఎంత ఈదినా దరికి రాలేకపోతునాన్ను…

అంతలా పడి, మునిగిపోయాను

నీ ప్రేమలో ఎంతలా అంటే నన్ను నేను

మరిచిపోయి నాలో నిన్ను

చూసుకునే అంతా..!

ఏదో తెలియని ఆనందం

చెప్పలేని సంతోషం….

ఎగిరి గంతులేస్తున్న’

అద్దంలో లో నాకు నేనే కొత్తగా

కనిపిస్తున్న నీ ముఖ చిత్రాన్ని

చూసి మురిసిపోతున్న…

పడుకుని దుప్పటి ముసుగేసుకుని ‘

కలల లోకంలో విహరిస్తున్న’

వెచ్చని ఊసులతో జాగారం చేస్తున్న

ప్రేమ చలి మంటలు మనసుకు తగిలి

తనువులో వేడిని రగిలిస్తున్నాయి..

ఏమి ఈవింత…!

ఓ కొంత ఆశ్చర్యం మరి కొంత ఆనందం

తెలియని ఉల్లాసం ఉరకలు వేసి

కేకలు పెట్టి అరిచేలా,

బహుశా ఇలా ఇలా నా ఒక్కడికేనా

ప్రేమలో పడ్డ ప్రతి ఒక్కరికి

ఇలానే ఉంటుందా అని అనిపించేది…””

ప్రేమలో ఉండే మత్తు గమ్మత్తు ఇదేనేమో,

తొలకరి చినుకు పడి, పుడిమి వాసన…

ఇంద్రధనస్సు రంగులు

వసంత ఋతువులలో

ప్రకృతి అందాలు

చల్లటి వాతావరణం

మట్టి పరిమళాలు

మేగ్గ నుంచి విచ్చుకునే పుష్పాలు

తుమ్మెదలు కోయిలలు ఇలా…

ఏది చూసినా ఇలా’

పకృతి కాంతలో….

నా చెలి వయ్యారపు

ఒంపుసొంపుల

అందాలను ఊహించుకొని ”’

నా మనసుతో

స్పర్శంచుకునేవాడిని

స్పర్శించేవాడిని….

ఇలా నాకేనా ఈ వింత ఆశ్చర్యం

మనసు స్పర్శతో పరవశం

ఏమో నాకు తెలియలేదు’

తను నన్ను ప్రేమిస్తుందో లేదో కానీ:

నా మీద అభిమానం స్నేహం

ఆప్యాయత ఉందని నా నమ్మకం…

మా పరిచయం కనుచూపు

సైగాలతో సాధారణంగా  జరిగిన

చరవాణి ‘ సంభాషణతో ”’

మా అభిప్రాయాలు ఆలోచనలు

చాలా దగ్గరగా వ్యక్తిగత

సంఘటనలు పంచుకునేలా

కష్ట సుఖాలకు ఒకరికొకరం

ధైర్యాన్ని ప్రేరణ కలిగించేలా

అన్ని  చెప్పుకునేవాళ్ళం..!

‘నాకన్నా ప్రతి విషయంలో చాలా ఎక్కువ

వయస్సులో మాత్రం నాకన్నా కొంచెం పెద్ద

మా చరవాణిలో అటో ఇటో సుమారుగా

రెండు సంవత్సరాల పైన మాటలు,

మధ్య మధ్యలో ఓ కొంత ఎడబాటు

వచ్చిన అలా చరవాణి ప్రయాణం సాగింది.

కలుద్దాం అన్నాను సరే అన్నది,

ఏదో కొన్ని కారణాల చేత

తను కలవలేదు అది తన ఇష్టం…

తనను ప్రేమించే స్థాయి

నాకు ఉందో లేదో తెలియదు కానీ,

తను నన్ను ప్రేమించే స్థాయి

నాకు లేదేమో అని నా అభిప్రాయం…””

ప్రతి విషయంలో చాలా ఉన్నతంగా ఉంది

డబ్బు హోదా చదువు వ్యక్తిత్వం

మంచి మనసు తనలో

నాకు నచ్చే అందం కూడా,

తనకున్నవాటిలో అలా నాకేమీ లేవు

పెద్దగా కేవలం తన వ్యక్తిత్వం వల్ల నాకు’

తెలియకుండానే…’

నామనసు ఇచేస్తా, ప్రేమించా…!

కొంచెం అటు ఇటు అతి’

ప్రవర్తన చేసిన తాను క్షమించేది

ఒకరోజు నా ప్రేమ

తనమీద నాకున్న భావాలు

తను అంటే ఎందుకింత ఇష్టం ప్రేమ

నా ప్రేమ  మొత్తం వివరించాను…

నిన్ను ప్రేమించే అంత స్థాయి

పెళ్లి చేసుకోవాలని అంత అర్హత

నాకు లేదు అని తెలుసు

అయినను నువ్వంటే ప్రేమ

అని నా మనసులో దాచుకున్న

ప్రేమను మొత్తం తేల్చి చెప్పా,

ఇన్ని రోజులు నీతో మాట్లాడింది…

నీతో స్నేహం ఇది చెప్పటానికి

వేసుకున్న ముస్కు కాదు,

నా ప్రేమ ముసుకు వేసిన ప్రేమ కాదు

గుండె లోతుల్లో పదిలమైన ప్రేమ

నా ప్రేమ నీకు తెలియాలని

ఈ సమయం వెళ్లిపోతున్నది

ఇప్పుడు చెప్పకపోతే

ఎప్పుడు చెప్పలేను అని,

నా మనసులో ఉన్నది చెప్పా

అని చెప్పాను..

ఇది కేవలం ఇప్పుడు మాత్రమే “

ప్రేమిస్తున్నానని కాదు,

నా జీవితపు పేజీలో

ఎప్పుడు నువ్వు ఉంటావు,

తనువు ఉన్నంతవరకు

కట్టె కాలే వరకు

నిన్ను ప్రేమిస్తా ప్రేమిస్తూనే ఉంటా

అన్నాను అందుకు తన సమాధానం…

ఓ అవునా నన్ను ప్రేమిస్తున్నావా

హ్మ్మ్ … ఓకే సర్లే,,,,,

ఇవన్నీ మర్చిపో,

ఇవన్నీ కుదరవు ‘

అనవసరంగా అన్ని ఆలోచించకు

అని సమాధానం ఇచ్చింది…

తర్వాత కూడా నాతో చాలా స్నేహంగా

కొన్ని రోజులు మాట్లాడింది…

తన మీద ప్రేమ ఉన్నా,

మళ్లీ ఆ ప్రస్తావన తేలే

కొద్దిరోజుల తర్వాత తనకు

వివాహం అయ్యింది..,

పెళ్లికి ఏదో మొహమాటంగా

ఆహ్వానించింది…

కానీ నేను వెళ్ళలేదు..!

ఊరికి వెళ్తే అప్పుడప్పుడు కనిపిస్తాది,

తను నన్ను చూస్తాందో లేదో తెలియదు,

తను ఎవరితో ఉన్నా

చాలా ఆనందంగా సుఖంగా

ఉండాలి, అని మనస్ఫూర్తిగా

ఎప్పుడు కోరుకుంటా

తన మనసులో ఒక జ్ఞాపకంలా

వుంటే చాలు  ఎప్పటికి

అంతే చాలు అంతే…!

తన సమాధానంలో

ఇప్పటికీ నేను ఇష్టమా కాదా,

ఏదో ఇబ్బంది పెట్టొద్దు

మనసును బాధ పెట్టొద్దు అని

సున్నితంగా  అలా చెప్పిందా

ఒకవేళ ప్రేమ ఉన్న ఇవన్నీ కుదరవు:

ఇంట్లో ఇబ్బందులు తనకి నేను సరిపోను…

అనుకుందా అని ఏమి తెలియదు..?

‘జీవితంలో ఇవి జ్ఞాపకాల,

లేక చేదు అనుభవాల’ తెలియదు

కానీ  కొన్ని జీవితంలో

ఎప్పటికి మర్చిపోలేం మరవలేము ‘

కానీ ప్రేమలో పడితే

తీపి చేదు,

బాధ సంతోషం

దుఃఖం ఆనందం

అన్నీ ఉంటాయి అని అర్థమైంది..

కథను కూడా కవిత్వంలా చెప్పాలి

అందముగా అని నా అభిప్రాయం

అప్పుడే ఆ కథ అందమైన

కావ్యం అవుతుంది…

మంచి సౌందర్య

శిల్పంలా తయావుతుంది

ఇదే నా ప్రేమ కథ…. !!

♥️♥️️♥️♥️♥️♥️♥️♥️♥

ఇంతటితో సమాప్తం  కథ సుఖాంతం

♥️ శుభం ♥️

 

♦️——————–♦️

 

 

– Saidachary Mandoju

Previous post Oka Roju
ఓ వేశ్య Next post ఓ వేశ్య

2 thoughts on “నా ప్రేమకథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *