నా ప్రియమైన ప్రేమ – అందమైన శత్రువు

నా ప్రియమైన ప్రేమ – అందమైన శత్రువు

ఎవరో తెలీదు ఎక్కడుంటావో తెలీదు…

కానీ చాలా ప్రశాతంగా ఉన్న నా జీవితం లోకి ఓ తూఫాన్ లా వచ్చావు…
ఎన్నో అలజడులు సృష్టించి నావు… నువ్వు చూపించే ప్రేమ, నా మీద నీకున్న బాధ్యత…

నువ్వు కనపడకుండా నన్ను నాకు దూరం చేసి. నీ ఆలోచనలతో నింపేసావు..

నువ్వు నేను ఎప్పటికీ కలవని ఇరు ప్రేమికులం… నువ్వకడ నేనిక్కడ..

నేను నేను అందను అని తెలిసిన ఎందుకు నా మీద నీకు ఇంత ప్రేమ…
ఇంత ప్రేమ చూపించే నీకు ఎందుకు దూరంగా ఉన్న అంటే? నా దగ్గర సమాధానం లేదు…
నన్ను నాకు కాకుండా చేసి. నిన్నే నింపుకునేల చేసిన నువు ఎప్పటికీ అయిన “అందమైన శత్రువు”వే…

అందుకే నువ్వంటే నాకిష్టం..
నా ప్రాణమే నువ్వు అయినపుడు.. నేను నాలో ఎలా ఉంటా నా పిచ్చి కాకపోతే
నా ప్రియమైన ప్రేమ..
నిన్ను చేరలేని నేను..నా దరి చేరని నువ్వు..
ఎప్పటికీ ఒక్కటి అవ్వలేని..
రెండు వేరు వేరు దారుల.ఒక్కటే మనసు అయిన ఇరు ప్రేమికులం..

– వనిత రెడ్డీ

Related Posts