నా రాణి

నా రాణి

వేయి కన్నుల కాంతులు

నీ కన్నులు మెరిసే రాయి కూడా రత్నమే రత్తాలు..

మనసులోని భావాలు మోములోన మెరిసే..

రవి కాంతులు కాంతను గాంచె…

భువిపై వెలిసిన వెన్నెల కాంతవు..

రవి చూడని వెన్నెల నా కన్నుల పంట నా రాణివి అంట…
నీ తీరుతెన్నులు నా తీరం దాటిన హద్దులు

ప్రేమ తీర్థం పుచ్చుకోనా కోమలి…

నీ చిత్రం గీసిన చిత్రకారుడు ఏ మంత్రం వేసాడో కానీ

జపిస్తున్న నీ మంత్రాన్ని అన్ని వేళలా..

సొగసుల సొత్తుల మేళవింపుగా..

ముంగురులు మోముపై వాలి

నీ జాలి చూపులు నాపై జారి జావళీలు చేస్తుందే హాయిగా..

పెదవి పలకరిస్తుంది దప్పిక తీర్చమని..

వేసవి కొసరికొసరి అడుగుతుంది దాహం తీర్చమని…

మోహం మోజుగా మొహమాటం చేస్తుందే…

ఊగిసలాడే చెవి దిద్దులు మనవి చేస్తున్నాయి..

మరీ మరీ వద్దకు రమ్మని..

కమ్మని ప్రేమను ఇమ్మని…

నా మనసును ఊసులాడేట్టు….

– పలుకూరి

Related Posts