నాగరికత

నాగరికత

నాగరికత

పెడకల్లు పురుగు పుట్రా రానివ్వకుండా చేస్తాయి. బియ్యపు పిండి ముగ్గు క్రిమి కీటకాలకు ఆహారం అవుతాయి. ముగ్గిట మామిడి తోరణాలు స్వఛ్చమైన గాలినిస్తాయి. జాజు అలుకుడు చెడు దృష్టిని తిప్పి కొడుతుంది. కుండలో నీరు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

మట్టి పాత్రలో వండిన వంటకాలు గుండెను కాపాడతాయి. అల్లం, వెల్లుల్లి హుద్రోగాలు రాకుండా చేస్తాయి. దగ్గు, జలుబుకు శొంఠి కషాయం విరుగుడే, పెరుగు చల్లదనాన్ని ఇస్తే, వెన్న వెన్నెముక ను కాపాడుతుంది. ధనియాలు జీలకర్ర మిరియాలు రోగాలని దరి చేరకుండా చేస్తాయి.

కాళ్లకు పెట్టుకునే పసుపు రక్తాన్ని గడ్డ కట్టేలా చేస్తుంది. కారం ఒంటికి శక్తిని అందిస్తుంది. వేపాకు కు మించిన ఔషధం లేదు. పారిజాత వాసనలు, జాజి మల్లెల సుగంధాలకు ఎలాంటి సెంటు అయినా దిగదుడుపే. ఛాయా పసుపు తో అందం ద్విగుణీృతం అవుతుంది. దానికి ఎలాంటి ఫెయిర్ అండ్ లవ్లీ లు పనికి రావు.

గంధం సువాసనలు వెదజల్లుతూ నలుగురిని ఆకర్షించేలా చేస్తుంది. ఇక ముంగిట వేసే ముగ్గులో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. రాగి చెంబులో నీరు ఆరోగ్యాన్ని, అయిశ్శు ను పెంచుతుంది. ఇత్తడి బిందె లో నీరు ఎముకలను బలంగా చేస్తుంది. ఎముకల పొడి తో చేసిన హర్లిక్స్ దేనికి పనికి రాదు.

నెయ్యి నామ మాత్రంగా తింటుంటే కండ పుష్టి పెరుగుతుంది. ఇంట్లో ఉన్న రోజూ వాడుతున్న వాటిని సరైన పద్ధతిలో వాడకుండా ఆకర్షించే ప్రకటనలతో హోరెత్తించే వాటిని వాడుకుంటూ మన పూర్వీకులు కని పెట్టిన వాటిని హాస్యాస్పదం చేస్తూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు.

సైన్స్ పరంగా కూడా ప్రాచీన పద్ధతులే మంచివని ఇప్పటి ఆయుర్వేద వైద్య ఆశ్రమాలు చెప్తున్నా, వాటిలో చేరడం గొప్పగా భావిస్తూ, ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం, పప్పు రుబ్బడం, బట్టలు ఉతకడం వంటివి పని మనుషులకు వదిలేసి అదో గొప్ప అనుకుంటున్నారు. ఇంటి పనిలో ఎక్సర్ సైజ్ కోసం యోగ క్లాసులకు వెళ్తున్నారు.

ఇంటి పని చేయడం నామోషీ గా భావిస్తూ డబ్బు కోసం వెంపర్లాడటం, డబ్బు సంపాదనకు మరిగి ఆంగ్ల పద్దతులు పాటిస్తూ పిజ్జాలు, బర్గర్లు తింటూ ఒళ్ళు పెంచుకుంటూ దాన్ని తిరిగి తగ్గించుకోవడం కోసం జిమ్ ల వెంట పరుగులు తీస్తూ, డాక్టర్ లకి లక్షలు ఖర్చు చేస్తున్నారు.

నాగరికత పెరగడం మంచిదే కానీ మన అలవాట్లు, పద్దతులు, ఆచార వ్యవహారాలు మర్చిపోతూ చదువుకున్న చదువుకు కాకర కాయని కీకరకాయంటూ మాట్లాడడం మాత్రం విడ్డూరమే అనిపిస్తుంది.

– భవ్య చారు

విజ్ఞాన భాండాగారం Previous post విజ్ఞాన భాండాగారం
అంత వరకూ మంచిదే.! Next post అంత వరకూ మంచిదే.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *