నాకింకా అది రాలేదు

నాకింకా అది రాలేదు

జీవితం, ఎప్పుడు ఎక్కడ ఎవ్వరికి ఎలా దూల తీరుస్తుందో చెప్పలేము , నా వరకు నేను ఒక్కసారి కుడా పంద్రా ఆగష్టు కు ఒక్క పోటీలో పాల్గోనింది లేదు , ఒక్క ప్రైజు గెలిచింది లేదు , ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని ఆలోచిస్తే చెప్పలేని చెప్పుకోలేని ఎన్నో కారణాలు నాలో ఏ పొటీ తత్వం లేకుండా చేసాయో ఒకదాన్ని కూడా వేలెత్తి ఇదీ కారణం అని చెప్పలేను .

స్వాతంత్రం రాలేదు
స్వాతంత్రం రాలేదు

కానీ , నా చిన్నప్పుడు ఎక్కడో ఒకచోట నాలాగే, కాదు నాకంటే దీన స్థితిలో ఉన్న ఎంతో మంది కుర్రాళ్ళు వాళ్ళ కష్టాలు , కన్నీళ్లు అన్నిటిని దిగమింగుకొని , వారు బాగుపడాలంటే సాహసాలు చేయక తప్పదు అని తెలుసుకుని కాస్త కష్టపడితే చాలు భవిష్యత్తులో సంతోషంగా ఉండగలం అనే నమ్మకంతో అప్పటి ఆ రోజులను ఓడించి ఇపుడు మేము గెలిచాము అని ప్రపంచానికి చెప్పిన విషయాలు గుర్తుచేసుకుంటే, వాళ్ళకు అప్పుడు ఉన్న ఆ తెలివిలో , ధైర్యంలో వీసమంత ధైర్యం ,తెలివి సాధించాలి అనే తపన నాకు ఉండుంటే నేను ఇపుడు ” పంద్రా ఆగష్టు” కు ఇలా చేశాను అల చేశాను అని రాసేవాడినేమో కానీ నాకింకా ” స్వాతంత్ర్యం ” రాలేదు ..

తెగింపే నీ మొదటి గెలుపు మిత్రమా.

జైహింద్

– అర్జున్

Related Posts

1 Comment

Comments are closed.