నాకు జరిగిన అనుభవం

నాకు జరిగిన అనుభవం

కొన్ని సంవత్సరాల క్రితం నా అనుభవం. అయితే ఏమైందంటే నేను అమ్మ గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నేను హైదరాబాదులో ఉంటాను, అమ్మ వాళ్లు కామారెడ్డి లో ఉంటారు. అమ్మకు ఆరోగ్యం అంతగా బాగుండదు ప్రతి నెలలో రెండు మూడు వారాలు అక్కడికే తిరగవలసి వచ్చేది.

ప్రతి నెలలో రెండు సార్లు మూడు సార్లు వెళ్ళేదాన్ని. అమ్మ ఆరోగ్యం గురించి నేను తిరగవలసి వచ్చేది అయితే ఒకరోజు ఏమైందంటే నేను తీసుకు వెళ్ళిన డబ్బులు అయిపోయాయి డబ్బులు ఎక్కువగా లేవు నా దగ్గర 500 ఉన్నాయి. అమ్మకు చెప్పి మళ్ళీ వస్తాను అని పొద్దున్నే బయలుదేరాను.

బస్టాండ్ కి వచ్చేసరికి పది గంటలు అవుతుంది బస్సు కోసం నిలబడ్డాను ఇంతలో నా తమ్ముడు వచ్చి అక్క నాకు ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వు నాకు చాలా అర్జెంట్ అవసరం ఉంది అని అడగగానే నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను బస్సు ఎక్కించడానికి తీసుకువస్తాడు వాడికి ఏమి అవసరం ఉండదు 100 రూపాయలే కదా అడిగేది అనుకుంటూ నా దగ్గర ఉన్న ఐదు వందలు తీసి ఇచ్చాను.

చిల్లర తీసుకోరా నీకు ఇస్తాను మిగతా చార్జీలు అవుతాయి అక్కడి నుండి మళ్ళీ నేను ఇంటికి వెళ్లాలంటే ఆటో కి వెళ్ళాలి ఆటో కిరాయి కూడా మిగతావి నాకు ఇవ్వు అంటూ వాడికి 500 ఇచ్చాను. వాడు చిల్లర కోసం వెళ్ళాడు.

నేను ఒక బస్టాండ్ లో నిలబడ్డాను, నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ తప్ప ఇంకేమీ లేవు. భుజానికి తగిలించుకొని పట్టుకొని నిలబడ్డాను ఎంతకు బస్సు రావడం లేదు.

పొద్దు పోతుంది నేను మళ్ళీ అక్కడ దిగి వేరే ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఇంకా తమ్ముడు రాలేదేంటి అని చుట్టూ చూస్తున్న నాకు దూరంలో ఒక ఆవిడ కనిపించింది. ఆమె ముస్లిం, తెలుగు కాదు ఆమె మొహం తెలియట్లేదు.

నిండుగా తెల్లటి కొంగు లాంటిది కట్టుకుంది. ఆమె నన్ను చూసి కూర్చునదల్లా లేచి నా దగ్గరకు వచ్చింది. ఏమంటుందో నాకు ముందుగా అర్థం కాలేదు తర్వాత ఆమె కొద్ది దూరం వెళ్లి నిలబడి “చాందినీ ఆవు బేటా” అంటూ నన్ను పిలిచింది.

ముందుగా నేను అది పట్టించుకోలేదు మళ్లీ పిలుస్తూనే ఉంది. “చాందినీ మేరా బేటీ, చాందిని ఆవు బేటా” అంటూ నాకు కొద్ది దూరంలో నిలబడి పదేపదే పిలుస్తుంది. నేను చుట్టూ చూశాను ఎవరు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు.

బస్సు కోసం ఎదురు చూస్తూ, లగేజీ తెచ్చుకున్నవాళ్లు సర్దుకుంటూ, ముందుకు వచ్చి నిలబడ్డారు. వారికి కొద్ది దూరంలో మేమున్నాము ఆమె అలా ఎందుకు పిలుస్తుంది నాకు అర్థం కాలేదు.

ఇంకొంచెం దగ్గరగా వచ్చి నా చెయ్యి పట్టుకుని, “రా బేటి చాందిని మై ఘర్ మే చల్ గయా ఇదర్ ఆ భేటీ” అంటూ నా చేయి పట్టుకొని లాగుతుంది. నేను ఆమె లాగిన లాగుడుకు ఆమె దగ్గరగా వెళ్లాను.

నాకు ఆమె దగ్గర ఎంతో కమ్మటి వాసన మత్తు గొలిపించే వాసన వచ్చింది. నేను ఆ వాసన పీల్చాను. నాకెందుకో ఆమె మాటలే వేదాలుగా వినిపించాయి. ఆమెతో వెళ్లాలి అనుకుంటున్నాను నా మనసులో….

అలా అని అనుకున్న నేను, ఆమె వెనకాలే వెళ్తున్నాను. నా దగ్గర పెద్దగా లగేజీ లేదు. భుజాన ఉన్న బ్యాగులో ఒక చీర, లంగా, జాకెట్లు తప్ప ఇంకేమీ లేవు. చేతికి ఒక వాచీ, ఫోను తప్ప నా దగ్గర ఏమీ లేవు. నాకు మెడలో ఒక చిన్న గొలుసు ఉన్నది.

నాకు ఏమైందో తెలియదు కానీ నేను ఆమె వెనకాలే వెళ్తున్నాను. ఇంతలో చిల్లర తీసుకొచ్చినా నా తమ్ముడు అక్క ఏమిటీ? ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ నన్ను చెయ్యి పట్టి లాగాడు.

అప్పటివరకు ఏమైందో నాకేమీ గుర్తు లేదు నన్ను తీసుకు వచ్చి ఒక బెంచీ మీద కూర్చోబెట్టిన నా తమ్ముడు, నా బ్యాగులో ఉన్న చిన్న వాటర్ డబ్బా తీసి కర్చీఫ్ లో నీళ్లు చల్లి ఆ చల్లటి కర్చీఫ్ తో నా ముఖము తుడిచాడు.

అప్పటివరకు నేను మత్తులో ఉన్నాను. కానీ తమ్ముడిని చూడగానే నాకు కొండంత బలం వచ్చింది. ఏమిటి నేను ఎటు వెళ్తున్నాను నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగాను.

నువ్వు ఎందుకు అలా ఆమెతో వెళ్తున్నావ్ అంటున్న తమ్ముడి ముఖం చూస్తూ అలాగే ఉన్నాను. ఇంకా నయం నిన్ను చూడకుండా ఉంటే బస్టాండ్ దాటి ఆమెతో వెళ్ళిపోయేదానివి.

ఎందుకు అలా చేసావు అంటూ వాడు నన్ను అడుగుతుంటే ఏం లేదురా నీకు డబ్బులు ఇచ్చాను కదా నువ్వు అవి తీసుకుని వెళ్లావు ఏమో నాకు కనిపించలేదు. ఎవరో ఆవిడ నా దగ్గరగా వచ్చి, “చాందిని మేరా బేటీ, చాందిని ఇదర్ ఆవ్” అంటూ నన్ను పిల్లల సాగింది.

ఎవర్ని పిలుస్తుంది అని నేను చుట్టూ చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. మెల్లగా ఆమె నా దగ్గరగా వచ్చి, నా చేయి పట్టుకొని తన దగ్గరికి లాక్కుంది. ఆమె దగ్గరికి వెళ్ళగానే నాకు ఆమె దగ్గర కమ్మటి వాసన వచ్చింది. ఎదో తెలియని మత్తుగా అనిపించి నాకు ఇంకా ఏమీ వినిపించలేదు ఆవిడ వెనకే వెళ్తున్న అంటూ తమ్ముడికి చెప్పాను.

ఇదంతా విన్న నా తమ్ముడు బిత్తరపోయి చూస్తూ, ఇంకా నయం ఆలస్యంగా వచ్చినట్లయితే నువ్వు ఆమెతో వెళ్ళిపోయే దానివి. నాకు చాలా బాధగా ఉంది. అలా ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్ళకూడదు నీకు తెలియదు అక్క అన్నాడు తమ్ముడు.

వాడు జేబులోనుండి నేను ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తూ అందులో నుండి వంద రూపాయలు తీసుకున్నాడు. బస్సు కోసం నిలబడ్డాము ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అక్క అంటూ అడిగాడు వాడు.

పర్వాలేదు బాగానే ఉన్నాను ఇంకెప్పుడూ ఎవరు పిలిచినా దగ్గరగా వెళ్ళను అంటూ తమ్ముడికి ప్రామిస్ చేసి బస్సు రాగానే నా కోసం తమ్ముడు ముందుగా బస్సు ఎక్కి సీటు చూసి కిటికీ పక్కన ఉన్న సీటు పక్కనే కూర్చోబెట్టి పర్వాలేదా ఇప్పుడు వెళ్తావా ఒంటరిగా నేను అర్జున్ కి ఫోన్ చేసి నిన్ను తీసుకువెళ్ళమని చెప్పి వాడికి ఫోన్ చేస్తాను.

వాడు వచ్చేవరకు నువ్వు అక్కడే నిలబడు అంటూ నాకు జాగ్రత్తలు చెప్పి బస్సు కదిలే సమయానికి వాడు దిగి వెళ్ళిపోయాడు. జాగ్రత్త అంటూ మరోసారి వచ్చి చెప్పి వెళ్ళాడు బస్సు బయలుదేరింది.

నేను ఎలాగో అలాగా హైదరాబాద్ వచ్చే వరకు ఎక్కడ బస్సు ఆగినా ఏమి కొనలేదు. తినడానికి కనీసం వాటర్ కూడా తాగలేదు భయపడుతూ నా స్టాప్ వచ్చేదాకా కూర్చోని, బస్సులో నుండి మా అబ్బాయిని చూసి బస్సు దిగాను.

వాడు నన్ను చూసి, ఏమిటమ్మా ఎలా ఉన్నావ్ ఏమైంది అని అడుగుతుంటే చాలా బాధగా అనిపించింది. అమ్మో ఆమెతో నేను వెళ్లినట్టు ఉంటే నా పిల్లలకు నేను కరువయ్యే దాన్ని అని మనసులో అనుకొని వాడితో పాటు బైక్ పై ఇంటికి చేరుకున్నాము.

కాళ్ళు చేతులు కడుక్కుని ఇంత అన్నం తిని ఎవరితో ఏమి మాట్లాడకుండా పడుకున్నాను. భయం తో నిద్ర కూడా రాలేదు. పిల్లలంతా వచ్చి అమ్మా ఏమిటి ఏం జరిగింది చెప్పు అంటూ అడిగారు. నిజం దాచలేక వాళ్లకి ఉన్న విషయం చెప్పాను.

వాళ్లు అంతా విన్నాక ఈరోజు నువ్వు లేచిన ఘడియ మంచిది అయింది లేకపోతే నువ్వు మాకు దక్కే దానివి కాదు మామయ్య ఉండి కాస్త మంచే జరిగింది లేకుంటే ఆమెతో వెళ్ళిపోయే దానివి. మేము అమ్మ అంటూ పిల్లలు నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చారు.

నాకు ఏడుపు వచ్చింది పిల్లలందర్నీ దగ్గరికి తీసుకుని చాలా ఏడ్చాను ఇది జరిగిన కొన్ని సంవత్సరాలు అయింది ఇది నాకు భయం గొలిపే నిజమైన వాస్తవం ఇప్పటికీ తలుచుకుంటే భయమేస్తుంది. ఇదండీ నా మరపురాని మర్చిపోలేని నిజంగా జరిగిన జ్ఞాపకం.

జన్మజన్మలకు మర్చిపోలేను మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే దాచకుండా నేను నేను పంచుకున్న విషయాలను మీరు కూడా పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి సంఘటన ఇక ముందు ఎవరికి జరగకూడదు అని కోరుకుంటున్నాను ఇదే నా నిజమైన అనుభవం.

– శారద. కె

Previous post బంధాల భాగ్యరేఖ..
Next post జంట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *