నాకు నచ్చిన సినిమా

నాకు నచ్చిన సినిమా

నాకు నచ్చిన సినిమా

నాకు నచ్చిన సినిమా, అధ్భుతమైన సినిమా అంటే ఓకే ఒక్కటి అలాంటి సినిమాలు మళ్లీ రావంటే అతిశయోక్తి కాదు. అలాంటి మంచి సినిమా , సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అధ్భుతంగా ఆవిష్కరించిన సినిమా “స్వర్ణ కమలం”.

నాట్యం అంటే నాకు చాలా ఇష్టం. నాట్యం నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉండేది. అందువల్లే ఆ చిత్రాన్ని ఇష్టపడను ఏమో కానీ కే. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా నాట్యం లోని మెళకువలు, నాట్యం లోని అనుసరణలు అన్ని తెలిపారు.

నాట్యం అంటే ఆసక్తి లేని హీరోయిన్ తండ్రి గుడ్డి తనన్ని ఆసరాగా చేసుకొని అతన్ని మోసం చేస్తూ ఉంటుంది. అక్క ఇంటి బాధ్యతలు చేపట్టి తనూ సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. అదే పోర్షన్ లో సంగీతం నేర్చుకునే అబ్బాయి ఆమెను ప్రేమిస్తూ తన ప్రేమను వెళ్ళడిస్తూ ఆమె అంగీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

ఆమెకి కూడా ఇష్టమే కానీ అతని తల్లిదండ్రలు మాత్రం కట్నం కావాలని చూస్తుంటారు. వాళ్ళు వీళ్లను గమనించి తండ్రి కుదరదు అంటే కుదరదు అని చెప్తూ ఉంటాడు.అయినా కొడుకు ఊరుకోకుండా ఆమెకి సాయం చేస్తూ ఉంటాడు.ఆమె ఇంట్లోనే అప్పడాలు వడియాలు పొడులు తయారు చేస్తూ అమ్ముతూ ఇంటిని నడుపుతూ ఉంటుంది.

ఇక హీరోయిన్ కి నాట్యం అంటే ఇష్టం ఉండక పోవడం తో ఏదో ఒక సాకు చెప్తూ నాట్యాన్ని నేర్చుకోకుండా సినిమాలు క చూస్తూ , ఆడుకుంటూ,పాడుకుంటూ ఉంటది.

ఇక హీరో అనాధ తనలాంటి ఒక అనాధ ను చేరదీసి హోర్డింగులు పెడుతూ ఉంటాడు. అలాంటి సమయం లో హీరోయిన్ నీ చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఇంటి ఎదురుగా ఉన్న పూజారి ఇంట్లో కిరాయికి వచ్చి, హీరోయిన్ నీ మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

మన సంస్కృతి సంప్రదాయాలు ముందు తరాలకి తెలియాలని దానికి మాస్టారు గారి కి సహాయం చేస్తూ , ఆయనకు కళ్లద్దాలు మార్చి , హీరోయిన్ నాట్యం మంచిగా నేర్చుకునేలా చేస్తాడు.

కానీ హీరోయిన్ కి ఇదంతా ఇష్టం ఉండదు. ఉద్యోగం చేయాలని మంచి మంచి చీరలు కట్టుకోవాలని సినిమాలకు వెళ్లాలని కోరికతో ఉంటుంది. అయితే హీరో మాత్రం తను నాట్యం నేర్చుకోవాలని ఆకాంక్షించు ఉంటాడు దానివల్ల హీరో పై కోపాన్ని పెంచుకుంటుంది.

అదే సమయంలో హీరోయిన్ మొదటి ప్రదర్శన ఏర్పాటు చేయిస్తాడు హీరో కానీ అది హీరోయిన్ కి ఇష్టం ఉండదు కాబట్టి తను ప్రదర్శనశాలకు రాను అని విష్మించుకొని కూర్చుంటుంది. అప్పుడు హీరో వచ్చి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు హీరోయిన్ చాలా కోపంతో,…

నువ్వు ఎందుకు మా ఇంటికి వస్తున్నావు, ఏం ఆశించి వస్తున్నావు ,నాకు ఇష్టం లేని పని నాతో ఎందుకు చేయించాలనే అనుకుంటున్నావు, అంటూ అతన్ని ప్రశ్నిస్తుంది. నా శరీరాన్ని ఆశించే కదా నువ్వు వస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నిస్తుంది. దానికి సమాధానంగా హీరో ఆమెని చెంపపై కొట్టి తయారవు అని చెప్పేసి వెళ్ళిపోతాడు.

ఇక హీరోయిన్ కోపంతో గజ్జలమ్మి ఒక్కొక్కటిగా కోసేసి నాట్యానికి సిద్ధమై ప్రదర్శనశాలకు వస్తుంది. నాట్యం చేస్తున్నప్పుడు అక్క పడుతున్న పాటకి అనుగుణంగా కాకుండా తండ్రి పడుతున్న పాటకి అనుగుణంగా కాకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ప్రదర్శన ఇస్తుంది ఇంతలో గజ్జలు ఒక్కొక్కటిగా ఊడిపోతాయి.

అది చూసిన తండ్రి తాను లేచి హీరోయిన్ బదులు తాను నృత్యం ఏం చేస్తూ ఉంటాడు. అందరూ షాక్ అవుతారు హీరోయిన్ మాత్రం ఏం తెలియనట్లు ఓ పక్కగా కూర్చుంటుంది. అలా నాట్యం చేస్తూ చేస్తూ తండ్రి చనిపోతాడు.

తండ్రి చనిపోవడం చూసిన హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ కళ్ళు చల్లబడ్డాయా ఇదే కదా నీకు కావాల్సింది కావాలని అన్ని చేశావు నువ్వు నా ఇంటికి ఎందుకు రావాలి నన్ను మార్చాలని ఎందుకు ప్రయత్నించాలి నేను ఇలా ఎందుకు చేయాలి అంటూ ఏడుస్తూ అడుగుతుంది.

అలా కొన్ని రోజులు గడిచిపోయాక హీరోయిన్ ఎప్పటిలా అక్క చేసిన అప్పడాలు తీసుకొని వెళ్తుంటే తన చిన్ననాటి స్నేహితురాలు కనిపిస్తుంది తనని ఇంటికి తీసుకువెళ్లి తన భర్తకు పరిచయం చేసి ఆమెకు జాబ్ అవసరం చాలా ఉంది అని చెప్తుంది. దాంతో అతను ఒక హోటల్లో రిసెప్షన్ గా జాబ్ ఇప్పిస్తాడు.

అది హీరోయిన్ కి ఇష్టమైన జాబ్ కాబట్టి ఇష్టంగా మొదటి రోజు అక్కడికి వెళ్తుంది. అక్కడ తన తండ్రి పేరు చూసి మేనేజర్ ఆశ్చర్యపోయి మీరు ఈ జాబ్ చేయడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అక్కడే ఉన్న హీరో ఆమెకి ఇలా చేయడం అంటేనే ఇష్టం అని చెప్తాడు అక్కడ హీరోయిన్ హీరోని చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. అతను ఆ హోటల్లో హోల్డింగులు పెడుతూ ఉంటాడు.

ఇక ఆ వర్క్ చేస్తూ హీరోయిన్ మంచి కలలు కంటూ ఉంటుంది కానీ హీరో మాత్రం మేనేజర్ తో మీ హోటల్లో ఈ అమ్మాయితో డాన్స్ ప్రదర్శన పెట్టిస్తే మీ హోటల్ కి మంచి పేరు వస్తుంది అని చెప్తాడు. దాంతో మేనేజర్ ఆమెను పిలిచి డాన్స్ ప్రదర్శనకి ఒప్పిస్తాడు. హీరోయిన్ కి ఇష్టం లేకపోయినా డాన్స్ చేయకపోతే తన ఉద్యోగం ఊడిపోతుందనే భయంతో దానికి ఒప్పుకుంటుంది.

ఇక ప్రదర్శన జరుగుతున్నంతసేపు డ్యాన్స్ పై దృష్టి పెట్టకుండా ఫోటోలకు ఫోజులిస్సు ఉంటుంది హీరోయిన్ అది చూసినా విదేశాలలో నాట్యం గురించి రీసెర్చ్ చేస్తున్న ఒక యువతి హీరోతో ఈమె ఇలా చేయడం మంచిది కాదు.

ఆమె నృత్యాన్ని తనది అని అనుకోవడం లేదు తన ఆత్మతో తను నాట్యం చేయడం లేదు కేవలం చేయాలి కాబట్టి చేస్తుంది. కానీ ఇది తప్పు నాట్యం అనేది ఒక కళ, అది అందరికీ రాదు ఈమెకు నాట్యంలో మెలకువలు తెలిసినా ఆమె కావాలనే చేయడం లేదు ఇది సరైనది కాదు నాకు నచ్చలేదు అని చెప్తుంది.

నాట్య ప్రదర్శన అయిపోయాక చాలామంది హీరోయిన్ ని మెచ్చుకుంటూ పూల బొకేలు ఇస్తూ ఉంటారు అది చూసి హీరోయిన్ ఆశ్చర్య పోతుంది నాట్యానికి ఎంతమంది ఇష్టపడుతున్నారా అని అనుకుంటూ ఆశ్చర్యపోయి తాను ఇన్నాళ్లు కోల్పోయింది ఏమిటో తనకు కొంచెం కొంచెం గా తెలుస్తూ ఉంటుంది కూడా హీరో తెలుగులో ఆమెకి అంటే హీరోయిన్ కి చెప్తాడు.

ఆ తర్వాత హీరోయిన్ ని తీసుకొని ఒక ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ తన తండ్రి శిష్యులు అయినా కొంతమంది తన తండ్రి విగ్రహాన్ని పెట్టుకొని నాట్యం నేర్చుకోవడం చూసిన హీరోయిన్ చాలా మారిపోతుంది తాను ఏం కోల్పోయిందో తనకు అప్పుడు తెలుస్తుంది తన తండ్రి గుర్తుకు వచ్చి రియలైజ్ అవుతుంది.

అప్పుడు మళ్లీ గజ్జలు కట్టుకొని నాట్యాన్ని తనలో లీనం చేసుకొని ఆపకుండా ఆగకుండా తనలో ఉన్న ఆవేశానంత తీర్చుకుంటూ తన తండ్రికి నివాళి అర్పిస్తుంది. హీరోయిన్ నిజమైన నాట్యం చేయడం చూసిన హీరోకి చాలా సంతోషం వేస్తుంది దాంతో మళ్లీ హోటల్లో ప్రదర్శనకి ఏర్పాట్లు చేస్తాడు.

అప్పుడు తను నాట్యంలో లీనం అయ్యి చేయడం ఆ విదేశీ వనిత చూసి తనకి విదేశాలకు రావడానికి తనతో పాటు తీసుకెళ్లడానికి హీరోని అడుగుతుంది. ఈలోపు హీరోయిన్ అక్క తను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంటుంది.

ఇక హీరోయిన్ కి విదేశాలకు వెళ్లడానికి అన్ని సిద్ధమవుతాయి వెళ్లే రోజు కూడా వస్తుంది. తను అలా రిక్షాలో వస్తున్నప్పుడు హోటల్లో ప్రదర్శించిన నాట్యంలోని ఫోటోలు పెద్ద పెద్ద హోల్డింగులుగా పెడుతూ హీరో కనిపిస్తాడు అవి చూసి హీరోయిన్ మనసు నల్లడిల్లిపోతుంది. ఎందుకంటే లోలోపల హీరోయిన్ కూడా హీరోని ప్రేమిస్తుంది.

ఇక హీరోయిన్ సాగనంపడానికి హీరో రాడు. వెంకటేష్ ఎందుకంటే అతను లక్ష్యం ఒక్కటే మన నాట్యం మన సంస్కృతి మన ఆచారాలు విదేశాల వరకు వెళ్లాలి హీరోయిన్ కి మంచి పేరు రావాలి అని ఉంటుంది కాబట్టి తనని చూసి ఆగిపోతుందని వెళ్లకుండా ఉంటాడు.

మరోవైపు బోర్డింగ్ పాస్ తీసుకున్న హీరోయిన్ బాత్రూంలోకి వెళ్లి చాలా ఏడుస్తుంది హీరోని వదిలి వెళ్లలేక పోతుంది. ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా బోర్డింగ్ పాస్ అవతల పారేసి హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అక్కడితో సినిమా ముగుస్తుంది.

నాట్యం అనేది అందరూ నేర్చుకునేది కాదు అది కొందరికే సొంతం. అది మనసుపెట్టి నేర్చుకుంటే తప్ప రానీ విద్య కాబట్టి మన విద్య మన సంస్కృతి సాంప్రదాయాలు విదేశాల వరకు వెళ్లాలి. నాట్యం అంటే కేవలం డబ్బుల కోసం పేరు కోసమే కాకుండా ఆత్మతో ఆస్వాదించి ఆవహించుకుని చేసే ఒక గొప్ప కళా దాన్ని కె విశ్వనాథ్ గారు చాలా బాగా చూపించారు.

ఇందులో పాటలన్నీ ఆణిముత్యాలు అని చెప్పవచ్చు ఆ పాటలు వింటున్నప్పుడు కలిగే ఆనందం, తన్మయత్వం పొందుతాము. ఆ పాటలన్నీ మరో లోకంలోకి తీసుకువెళ్తాయి అని అనడంలో సందేహం లేదు.

ఇక ఇందులో నటించిన భానుప్రియ వెంకటేష్ మిగతా నటీనటులు చాలా బాగా నటించారు అనేకన్నా జీవించారు అనడం మంచిది ఈ సినిమాకు నంది అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ ఉత్తమ సినిమాగా ఎంపికైంది స్వర్ణకమలం..

– భవ్యచారు

అహ నా పెళ్లంట Previous post అహ నా పెళ్లంట
రంగస్థలం Next post రంగస్థలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close