నాలాగా కాకూడదు

నాలాగా కాకూడదు

ప్రేమిస్తున్నాను అని చెప్తే చాలు
అది నిజమో అబద్దమో తెలుసుకోకుండా
వాళ్ళని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకోవడం
తర్వాత వాడి నిజస్వరూపాన్ని తెలిసి అవాక్కయ్యాను..
ఎవరి మాటలు వినకుండా నమ్మి మోసపోయాను.
ఇప్పుడు నేను ఎందుకు బ్రతకాలి?
ఎవరు కోసం నేను ఉండాలి?
నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతకాలి..
పిల్లలు కోసం ఉండాలి..
వాళ్ళని బాగా చూసుకొని మురిసిపోతూ
వాళ్లకి మంచి బాటలు వేయాలి..
ప్రతి అమ్మాయి జీవితమే నాలా కాకూడదు..
నాలాగా ఏ అమ్మాయి జీవితం పాడు చేసుకోకూడదు.

⁠- మాధవి కాళ్ల

Related Posts