నాలాగే ఇంకొకరు
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికిమనిషిని పోలిన మనుషులుఏడుగురు ఉంటారంటారు. ఆమాట ఎంత వరకు నిజమో తెలియదు కానీ నా జీవితంలోఒక సంఘటన జరిగింది. నేను
టీచరుగా పనిచేయక ముందుమార్కెటింగ్ చేసేవాణ్ణి. చాలావిస్తృతంగా తిరిగేవాణ్ణి. సిమెంట్ వ్యాపారి వద్ద పనిచేస్తూ కష్టమర్ల వద్ద సిమెంట్ ఆర్డర్లు బుక్చేయటం,సిమెంట్ కంపేనీ ఆఫీసులకు వెళ్ళి చెక్కులుఇచ్చి స్టాకు తెచ్చుకోవడంవంటి పనులు చేసేవాణ్ణి.
అలా వెళుతున్నప్పుడుఒకసారి ఒక లారీ ఓనర్ నన్ను తదేకంగా చూడటంగమనించాను. అతనునేను ఆఫీసులో ఎక్కడికివెళితే అక్కడకు వస్తున్నాడు.ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసాడు. కొంత సేపటికి లారీ క్లీనర్, డ్రైవర్ కూడా వచ్చారు. నన్ను వారంతా నోరెళ్ళబట్టి చూస్తున్నారు. నా గురించిరిసెప్షన్లో ఎంక్వైరీ చేసారనిరిసెప్షనిష్ట్ చెప్పింది. నాకుఎందుకో అనుమానం వచ్చింది.
వెంటనే ఆ లారీ ఓనర్ దగ్గరకువెళ్ళాను. విషయం అడిగాను.అతను చెప్పిన విషయాలు విని నాకు కళ్ళుతిరిగినంత పనిఅయ్యింది. ఆ లారీ ఓనర్ పేరుఖాదర్. అతని స్నేహితుడు రాజూ భాయ్. మహారాష్ట్రలోఉండేవాడట. అతను కూడాలారీ డ్రైవర్. అతనికి పెళ్ళైంది.భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.రాజు ఈ మధ్యనే చనిపోయాడు. షాకింగ్ విషయం ఏమిటంటే రాజుఅచ్చం నా లాగే ఉండేవాడట.పొడుగ్గా నా హైటే ఉండేవాడట. అతనికి గడ్డం ఉండేదట. నాకు గడ్డం లేదు.మిగతాదంతా సేమ్ టు సేమ్.
నన్ను చూసి ఖాదర్ చాలాసంతోషించాడు. ఆ లారీడ్రైవర్, క్లీనర్లు కూడా అలాగే నోరు తెరుచుకుని నావంకేచూస్తున్నారు. ఖాదర్ నాకుఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారిరాజు ఉన్న ఊరికి రమ్మనికోరాడు. రాజు బంధువులు,స్నేహితులు నన్ను చూసిచాలా సంతోషిస్తారు తప్పకరమ్మని కోరి అడ్రస్ కూడాఇచ్చాడు. నేను సరేననిచెప్పి ఆ ఆఫీసులో నా పనిచూసుకుని నా ఇంటికి వెళ్ళిఆలోచించాను.
రాజు ఎవరోనాకు తెలియదు. అతను నాలా ఉండటం విధి లిఖితం.ఇప్పుడు నేను వారి ఊరికివెళ్ళి రాజు బంధుమిత్రులనుమరింత బాధపెట్టడం నాకుఇష్టంలేదు. వారంతా జరిగిన
సంఘటన వల్ల బాధతో ఉంటారు. ఆ సంఘటనమర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడునేను వెళ్ళి పాత గాయం రేపటం ఎందుకు అని నాకుఅనిపించింది. ఆ అడ్రస్కాయతం చింపేసాను. ఆఫోన్ నెంబర్ డిలీట్ చేసాను.అలా వికలమైన మనసుతోనిద్రలోకి జారుకున్నాను.
యదార్ధమైన కధ కానీ వ్యక్తులపేర్లు మార్చాను.
-వెంకట భానుప్రసాద్ చలసాని