నైజం-నిజం

నైజం-నిజం

చెట్టు దీవెన ఎంత కమ్మన
పెనవేసే కొమ్మలతో
పలకరింపు
గీతం పాడుతుంది

మట్టిరేణువు ఎంత చల్లన
మోసే బరువును దించుకోవాలని
ఏనాడూ అనుకోదు
గాయాలవుతున్నా చిరునవ్వు మానదు

నీటి ఊటదెంత చలువ
దాహంతీర్చే జీవవాహిని
నాగరికతకు నడకలు నేర్పినది

కనిపించని గాలిదెంత ఓపిక
ప్రాణం నిలుపుతుంది
చల్లటి పిల్లతెమ్మెరగా పలకరించే
చెలిమి తోరణం

జీవాధారమైన జగతిలో
గతితప్పేది మనిషొక్కడే
మొట్టికాయలు తింటున్నా
మనిషి కదా నైజం మార్చుకోడు

– సి.యస్.రాంబాబు

Related Posts