నకిలీ బంగారం

నకిలీ బంగారం

నకిలీ బంగారం

 

ప్రవీణ్ ప్రతిరోజూ మార్నింగ్ వాక్ చేస్తుంటాడు. అలా ఒకరోజు మార్నింగ్ వాక్చేస్తున్న సమయంలో అతనికిరోడ్డుపై ఒక బంగారు చైన్కనపడింది. అటూ ఇటూచూసి ఎవరూ గమనించటంలేదని అనుకున్నాక ఆ గొలుసుతన జేబులో వేసుకోబోయాడు.అప్పుడే ఒక అపరిచిత వ్యక్తిప్రవీణ్ ముందుకు వచ్చాడు.ఆ బంగారు గొలుసు తానుచూసాడు కాబట్టి దానిలో
తనకూ వాటా కావాలి అనిఅడిగాడు.

అప్పుడు ప్రవీణ్ఆ అపరిచిత వ్యక్తికి కొంతడబ్బు ఇచ్చి గొలుసుని తనజేబులో వేసుకున్నాడు. ఎంతోఆనందంగా ఇంటికి వెళ్లి ఆగొలుసుని తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ గొలుసుని
పరిశీలించి అది దొంగ బంగారంఅని తేల్చి చెప్పింది. తాను మోసపోయానని ప్రవీణ్గ్రహించాడు. ఆ అపరిచితవ్యక్తే అలా నకిలీ బంగారంపడవేసి ఇలా తనను మోసంచేసాడని గ్రహించాడు. తనడబ్బులు అనవసరంగాపోగొట్టుకున్నానని బాధ పడ్డాడు. ఇలా మనుషుల బలహినత మీద దెబ్బకొట్టి మోసం చేసే వాళ్ళు
ఎందరో ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

కాలం వెనక్కి తిరిగితే నేను ఆయన్నే కలుస్తాను Previous post కాలం వెనక్కి తిరిగితే నేను ఆయన్నే కలుస్తాను
అడవిలో దెయ్యం (దెయ్యం పార్ట్ 4) Next post అడవిలో దెయ్యం (దెయ్యం పార్ట్ 4)

One thought on “నకిలీ బంగారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *