నాలో నేను

నాలో నేను

1) వృద్ధ గురువులంత ఒకచోట చేరగా
    పాత జ్ఞాపకాలు పరిమళించె
    అయ్యవారలంత ఆయురారోగ్యాల
    సాగవలయు శాంతి సౌఖ్యములతొ

2) ఉగ్రవాదమింత ఉగ్రరూపము దాల్చి
     బడుగు వర్గములను బలిని గోరె
     బడుగుజీవులనిల బాంబు పేలుళ్లతో
     ప్రాణములనుదీయ పాడియగునె

3) పండుగ దినమందు పస్తులుండాలేక
     కూలిడబ్బుతోటి కొట్టుకెళ్ళి
     ఉప్పు.పప్పునుకొని ఉల్లిపాయడిగితే
     ఆకసమునకేగి హాస్య మాడె

4) చెప్పు మాట యొకటి చేసేది వేరగు
     నాయకులను నమ్మి నాశ మవకు
     గొర్రెమంద రీతి గోతిలపడబోకు
     ఎసరు వచ్చినంక ఏడ్చుటేల?

– కోట

Related Posts