నమ్మకం

నమ్మకం

“హాయ్! కీర్తి ఎలా ఉన్నావే? ఎంత కాలం అయిందే” అని ఎంతో సంతోషంతో చెప్పుతుంది రమ్య. “అవునే చాలా ఆనందంగా ఉంది మన చిన్నతనంలో ఎక్కడికి వెళ్ళినా మన కలిసే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్. నీకు పెళ్లి అయ్యిందా?” అని అడిగింది కీర్తి.

“నీకు మన చిన్ననాటి విషయాలు చాలా బాగా గుర్తు ఉన్నాయే… ఈ గుడికి కొద్ది దూరంగా ఉంటున్నాము. మన చదువు పూర్తి అయిన తర్వాత నాన్న అనారోగ్యం కారణం వల్ల చనిపోయారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను అమ్మని తీసుకొని సిటీకి వచ్చేశాము. తమ్ముడిని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. నీకు పెళ్లి అయ్యిందా?” అని అడిగింది రమ్య.

“అవునా! ఇంత జరిగిందా? అని చెప్పి కొంచం బాధ పడింది. నాకు పెళ్ళి అయ్యి ఆరు నెలల అయింది. మేము కూడా పక్కనే ఉంటున్నాము. రా మా ఇంటికి తీసుకొని వెళతాను” అని చెప్పింది కీర్తి.

“సరే పద” చెప్పి కీర్తి ఇంటికి వెళ్ళారు. “మీ ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మా ఇల్లు కనిపిస్తుంది. బయటకు వచ్చి అక్కడ మా అమ్మ పక్కంటి ఆవిడతో మాట్లాడుతున్నారు చూడు” అని చెప్పింది రమ్య. “అవును నేను నీతో ఎప్పుడు మాట్లాడాలని అనిపించిన ప్రతిసారి మీ ఇంటికి వస్తాను అని చెప్పి ఈయన మా హస్బెండ్” అని పరిచయం చేసింది కీర్తి.

“నమస్తే ప్రతాప్ గారు” అని చెప్పింది రమ్య. “హా! నమస్కారం అండి రమ్య గారు” అని ప్రతాప్ చెప్పాడు. “మీ ఇద్దరికి ఇంతముందే పరిచయం ఉందా?” అని కొంచం ఆశ్చర్యంతో అడిగింది కీర్తి. “అవును పరిచయం ఉంది. ఎప్పుడు సరిగ్గా మాట్లాడుకోలేదు” అని చెప్పింది రమ్య.

“అదే కీర్తి ఒక రోజు ఆఫీసులో పార్టీ జరిగింది కదా… ఆ పార్టీలో ఒక అమ్మాయిని ఎవరో కొంత మంది అబ్బాయిలు ఏడిపిస్తున్నారు వాళ్ళకి బుద్ది చెప్పాను అని నీకు చెప్పాను కదా. ఆ అమ్మాయే ఈ అమ్మాయి” అని చెప్పాడు ప్రతాప్.

“అవునా! ఇంకా నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు” అని చెప్పింది కీర్తి.

“సరే ఇంకా నేను వెళతాను. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది” అని చెప్పి రమ్య వెళ్ళిపోయింది.

రమ్య గుడికి వెళ్ళి ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నావ్? నీకు ఆఫీస్ కి టైం అవ్వడం లేదా? అని అడిగింది కరుణ. “నా చిన్ననాటి స్నేహితురాలు గుడిలో కలిసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్న” అని చెప్పింది రమ్య. “అవునా సరే కానీ ఆఫీస్ బయలుదేరు” అని చెప్పి బాక్స్ తీసుకొని ఇచ్చింది రమ్యకి. రమ్య బాక్స్ తీసుకొని ఆఫీస్ కి వెళ్ళిపోయింది.

రమ్య ఇంటి ఎదురుగా ఉన్న కాంతమ్మ. భార్య, భర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు అసలు తట్టుకోలేదు. వాళ్ళ మధ్య ఏదో ఒక చిచ్చు పెట్టుతుంది. ఆవిడ ముందు ఎవరు సంతోషంగా కనిపించరు. వారం రోజులుగా కాంతమ్మ చూస్తుంది. రమ్య ఆఫీస్ కి వెళ్లిపోయిన తర్వాత కీర్తి రమ్య ఇంటికి వచ్చేంది. కరుణకి తోడుగా సాయంత్రం వరకు కీర్తి ఉండేది. అది చూసిన కాంతమ్మ ఒక సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది.

సడన్ గా కీర్తి అమ్మ గారికి ఒంట్లో బాగాలేదు అని ఫోన్ వచ్చింది. “కీర్తి కంగారుగా నాకు అమ్మని చూడాలని ఉంది” అని బాధతో చెప్పింది. “నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది. ఇప్పుడు వెళ్లడం కుదరదు. నువ్వు వెళ్ళు నేను రాలేకపోతునందుకు నువ్వు బాధ పడ్డాకు అని చెప్పాడు ప్రతాప్.

“సరే అండి. రేపు మార్నింగ్ బస్ కి వెళతాను” అని చెప్పింది కీర్తి. మార్నింగ్ ఈ విషయమే రమ్యకి చెప్పి కీర్తి బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీసుకి వెళ్ళిపోయాడు ప్రతాప్. కీర్తి ఊరు వెళ్ళిందని తెలుసుకున్న కాంతమ్మ. ఎలాగైనా సరే రమ్య, కీర్తి కి మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంది. ఒక రోజు కరుణకి సడన్ గా గుండెలో నొప్పి తో బాధ పడుతుంది.

“అది చూసిన రమ్య వెంటనే ప్రతాప్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది.” వెంటనే ప్రతాప్ తన ఫ్రెండ్ కారుని తీసుకొని వెళ్ళాడు. హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ చూసి ఫర్వాలేదు అని చెప్పారు. రమ్య రాత్రికి డిన్నర్ తీసుకోవడానికి “నేను ఇంటికి వెళ్ళి వంట చేసి తీసుకొని వస్తాను” అని చెప్పింది రమ్య.

“సరే నేను వస్తాను. పదండి నా ఫ్రెండ్ కి కార్ తీసుకొని వచ్చాను. కార్ కావాలని ఇప్పుడే ఫోన్ చేశాడు” అని చెప్పాడు ప్రతాప్. “కారులో ఇంటికి దగ్గర డ్రాప్ చేసి నేను బైక్ తీసుకొని వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రతాప్. “సరే అని చెప్పి” రమ్య ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళిపోయింది. వంట పూర్తి చేసి బయట ప్రతాప్ కోసం ఎదురుచూస్తుంది.

కాంతమ్మ రమ్యను గమనిస్తుంది. అప్పుడే బైక్ తీసుకొని రమ్య ఇంటికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. “నాకు వాటర్ కావాలి” అని అడిగాడు ప్రతాప్ “సరే ఇప్పుడే తీసుకొని వస్తాను” అని చెప్పి లోపలికి వాటర్ తీసుకొని వస్తుండగా గుమ్మానికి రమ్య కాళ్లు తగిలి ప్రతాప్ మీద పడింది.

అంతే అది చూసిన కాంతమ్మ. చుట్టూ ప్రక్కల ఉన్న అందరిని పిలిచి గోలగోల చేసింది. జనంలో ఉన్న కొందరు మాత్రం కాంతమ్మ మాటలు అసలు నమ్మలేదు. మరికొందరు అయితే సూటిపోటి మాటలతో రమ్యను తిట్టారు. రమ్య ఆ మాటలు తట్టుకోలేక ప్రతాప్ కి చెప్పకుండా హాస్పిటల్ కి వెళ్ళిపోయింది.

‘ఇంటి దగ్గర జరిగిన గొడవ గురించి అమ్మకి చెప్పకూడదు’ అని అనుకుంది రమ్య. రెండు రోజులు తర్వాత కరుణ ని ఇంటికి తీసుకొని వెళ్ళిపొమ్మని చెప్పారు డాక్టర్. కీర్తి ఊరు నుండి వచ్చింది అనే విషయం కాంతమ్మ తెలుసుకొని రమ్య, ప్రతాప్ మీద చెప్పుడు మాటలు చెప్పింది. అప్పుడే ప్రతాప్ ఇంటికి వచ్చి వాళ్ళ మాటలు బయట నుంచి వింటున్నాడు.

‘కీర్తి ఆవిడ చెప్పిన చెప్పుడు మాటలు అసలు నమ్మకూడదు. భగవంతుడా అని తన మనసులోనే ప్రార్థన చేస్తున్నాడు’ ప్రతాప్. సాయంత్రం ప్రతాప్ ఆఫీస్ నుండి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.

టీ తీసుకొని వచ్చి ప్రతాప్ కి ఇచ్చి తను తాగుతుంది. అత్తకి ఎలా ఉంది? అని అడిగాడు ప్రతాప్. “బాగుంది అండి. రేపు రమ్య పుట్టిన రోజు. తనకి మర్చిపోలేని గిఫ్ట్ చేస్తాను” అని చెప్పింది కీర్తి. “కొంచం కంగారుగా ఏంటి? ఆ గిఫ్ట్ నాకు చెప్పవా” అని అడిగాడు ప్రతాప్. “చెప్పను అండి. సర్ప్రైజ్ అని చెప్పి” కిచెన్ లోకి వెళ్ళిపోయింది.

ఉదయమే రమ్య ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పి అందరికి సాయంత్రం పార్టీ కి రమ్మని చెప్పింది కీర్తి. ముఖ్యంగా కాంతమ్మ కి.

అందరూ పార్టీ వచ్చారు. కీర్తి రమ్యని కేక్ దగ్గరకు తీసుకొని వచ్చింది. “నాకు ఎందుకు?” పుట్టిన రోజు పార్టీ అని చెప్పి వినకుండా ఏర్పాట్లు చేసింది కీర్తి. “రమ్య చేతికి ఒక రాఖీ ఇచ్చి ప్రతాప్ కి కట్టు” అని చెప్పింది కీర్తి. “కొంచం ఆశ్చర్యంతో ప్రతాప్ చేతికి సంతోషంగా కట్టింది” రమ్య. “ఇప్పుడు నా భర్త రమ్యకి అన్నయ్య అవుతాడు.

మొన్న కాంతమ్మ రమ్యకి , నా భర్తకి ఏదో సంబంధం ఉంది అని ఆ రోజు మీ అందరితో చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అన్నాచెల్లెల్లు. ఇప్పుడు చెప్పండి కోపంతో గట్టిగా” అడిగింది కీర్తి. పార్టీకి వచ్చిన ఒక పెద్ద మనిషి “కాంతమ్మ గురించి తెలిసి కూడా వాళ్ళని అపార్థం చేసుకున్నారు’ అని చెప్పారు. తప్పు అయిపోయింది కీర్తి గారు. ఇంకెప్పుడు కాంతమ్మ మాటలు నమ్మాము అని చెప్పారు.

“నాకు కాదు వాళ్ళకి చెప్పండి” అని కోపంతో చెప్పింది కీర్తి. “ఇంకొక్కసారి ఇలా జరిగితే మిమ్మల్ని పోలీస్ కి అప్పగిస్తాను” అని కాంతమ్మ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కీర్తి. కోపంతో కాంతమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. మీ ఇద్దరి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పింది కీర్తి.

“కన్నీళ్ల తో నీలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం” అని చెప్పింది రమ్య. రమ్య ఆనందంతో కేక్ కట్ చేసింది. అందరూ చప్పట్లు కొడుతూ విషెస్ చెప్పుతున్నారు.

ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని అసలు నమ్మకండి. వాళ్ళు చెప్పింది నిజమా, అబద్దమా అని తెలుసుకోండి.

⁠- మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress