నాన్న గురించి రచన
స్వార్థం తెలియనివాడు..దయామూర్తి నాన్నంటే
త్యాగం తెలిసినవాడు..ప్రేమమూర్తి నాన్నంటే
ఇంటికోసం సర్వస్వం..ధారపోసే అంకితభావం
కన్నవారి ఆశలుతీర్చే..కర్మమూర్తి నాన్నంటే
కంటినిండా నిద్రపోడు..కడుపునిండా భోంచేయడు
కష్టాలా కడలినిఈదే..సహనమూర్తి నాన్నంటే
కరిగే కొవ్వొత్తికిజాలి..నాన్నగారి జీవనశైలీ
కరిగిపోతూ వెలుగునుపంచే..త్యాగమూర్తి నాన్నంటే
బాధలెన్ని తనలోవున్నా..కనిపించనివ్వడు ఎవ్వరికీ
చిరునవ్వుల మాటునదాచే..ధైర్యమూర్తి నాన్నంటే
కడలిలా గంభీరతా..మదినిండా ఆప్యాయతా
కనిపించే..అమృతమూర్తి నాన్నంటే
నాన్నంటే..కోపం కాదు
నాన్నంటే..భయం కాదు
నాన్నంటే..దెబ్బలు కాదు
నాన్నంటే..అరుపులు కాదు
నాన్నంటే..నీ భవిష్యత్
నాన్నంటే..నీ ఉన్నతి
నాన్నంటే..నీ పదవి
నాన్నంటే..నీ ఉద్యోగం
నాన్నంటే..నీ హోదా
నాన్నంటే..నీ పాదరక్షలు
నాన్నంటే.. కనపడని ప్రేమ
నాన్నంటే..నినువీడని నీడ
నాన్నంటే..త్యాగమూర్తి
నాన్నంటే.. సహనమూర్తి
నాన్నంటే.. ఓ గంభీరతా
నాన్నంటే.. ఆప్యాయతా
#నాన్న అంటే త్యాగం
#నాన్న అంటే ప్రేమతో కూడిన బాధ్యత
#నాన్న అంటే ఎత్తైన శిఖరం
తన రెక్కలు ముక్కలు చేసుకుని రేయిపగలు కష్టపడి మనకు కవచంగా నిలిచే వాడే #నాన్న
తను ఓడిపోయి మనల్ని గెలిపించడం కోసం
మన కలల్ని కూడా నిజం చేయాలని చూసే త్యాగశీలి నాన్న…..
ప్రతి ఒక్క తండ్రి ఈ రచన అంకితం ఇస్తున్నాను ✍️🙏
-గురువర్ధన్ రెడ్డి