నరక యాతన

నరక యాతన

ఒక పట్టణంలోని కాలేజీలో ఫేర్ వెల్ పార్టీ జరుగుతుంది. పిల్లలందరూ చాలా బాగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కోలాహలం మధ్యలో చైత్ర చాలా హడావుడిగానూ, అందంగానూ తిరుగుతూ ఉంటుంటే కుర్రకారు ఆమె అందాలని చూస్తూ గుటకలు వేస్తూ ఉన్నారు.

చైత్ర చాలా అందమైనది అన్నిటిలో చురుకుగా పాల్గొంటుంది. చదువులో కూడా ముందు ఉంటుంది. చాలా మంది కుర్రకారుకి అమెంటే చాలా ఇష్టం ఎన్నో ప్రేమలేఖలు వచ్చినా తను చాలా లైట్ గా తీసుకుంది తప్ప ఎవరికీ ఏమీ చెప్పలేదు. కొన్నాళ్ళు ఎదురు చూసిన తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అయ్యి, ఎవరి చదువులో వాళ్ళు పడిపోయారు.

ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా, అవునే చాలా బాగా జరిగింది. ఇంత బాగా జరుగుతుందని అసలు అనుకోలేదు. అంటూ చైత్ర తన ఫ్రెండ్ ఆనంది ఇద్దరూ నడుచుకుంటూ కాలేజ్ గేటు బయటకు వచ్చారు అప్పుడే వచ్చిన ఆనంది తండ్రి రామ్మా ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ తన కూతుర్ని పిలిచాడు.

సరే చైత్ర నేను వెళ్తాను డాడీ వచ్చారు అంది. నువ్వు ఎలా వెళ్తావు అనగానే దానికి చైత్ర లేదు నాన్నగారు కూడా వస్తాను అన్నారు కాసేపట్లో వస్తారు నాకేం భయం లేదు నువ్వు వెళ్ళు అంది చైత్ర. సరే బాయ్ మరి రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి హాయిగా రెస్ట్ తీసుకో డాన్స్ చేసి అలసిపోయావూ అంది బైక్ ఎక్కుతూ ఆనంది.

సరేలే బాయ్ గుడ్ నైట్ అంటూ నవ్వుతూ టాటా చెప్పింది చైత్ర. బైక్ ముందుకు సాగిపోయింది. అలా బైక్ సాగిపోయిందో లేదో వెనక నుండి ఒక చెయ్యి వచ్చి చైత్ర ముక్కును అదిమి పట్టింది. ఆ సంఘటన ఊహించని చైత్ర గింజుకుంటున్నా కూడా కాసేపట్లోనే మత్తులోకి జారిపోయింది. ఇంతలోనే వెనకనుంచి కార్ రావడం ఆ కార్లోకి చేతులను నెట్టడం కారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగిపోయింది.

పది నిమిషాల తర్వాత అక్కడికి చైత్ర నాన్నగారు వచ్చారు. కానీ తన కూతురు ఎక్కడా కనిపించకపోవడంతో ఆనందితో వెళ్లి ఉంటుంది అని అనుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కాలేజీలో లేట్ అయిన ప్రతిసారి ఆనంది ఇంటికి వెళ్లడం చైత్రకు అలవాటే అందుకే అతను అక్కడ ఏమీ గమనించకుండానే ఎవరితో ఏం చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోయారు ఎలాగూ తెల్లారి వస్తుందిలే అనుకుంటూ.

**********

ఒక గదిలో బెడ్ పైన చైత్ర మగతగా పడుకుని ఉంది. అబ్బ ఏం అందంగా ఉందిరా ఇంత అందం ఇన్ని రోజులు మన ముందే తిరుగుతున్నా కనీసం మన వైపు కూడా చూడలేదు, మనం ఎన్నిసార్లు ప్రేమ రేఖలు రాసిన కనీసం మనల్ని కన్నెత్తి కూడా చూడలేదు, ఎంత పొగరు దీనికి ఇప్పుడు దీని పొగరు అనచాల్సిందే ఇప్పుడు దీన్ని అనుభవిస్తుంటే ఆ పొగరు అంతా ఎక్కడికి పోతుందో తెలుస్తుంది అని అనుకుంటూ ముందుకు పోయాడో ఒకడు.

ఒరేయ్ మత్తులో ఉన్నప్పుడు చేస్తే మజాయేముంది రా అది లేవాలి గింజుకోవాలి అప్పుడు దాన్ని అనుభవిస్తుంటేనే మనకు మజా అనేది వస్తుంది. ముందు దానికి మెలకువ తెప్పించండి అన్నాడు ఇంకొకడు.

అరే మెలకువ వస్తే మనం ఎవరేమో తెలిసిపోతుంది కాబట్టి మేలుకవ రాకుండా ఇంకొక డోసు మత్త ఇచ్చేసి గబగబా మనం పని చేసుకుందాం ఎలాగూ వీడియోలు తీస్తున్నాం కాబట్టి ఆ వీడియోలు చూపించి అవసరం ఉన్నప్పుడు దాన్ని ఆడుకోవచ్చు అన్నాడు ఇంకొకడు.

ఒక్కదాన్ని రుచి చూసాక మళ్ళీ మళ్ళీ దాన్నే పట్టుకుని వెళ్ళడం నాకు అస్సలు నచ్చదు కాబట్టి దానికి మెలకువ తెప్పించి మజా చేసుకొని వెళ్ళిపోదాం అన్నాడు ముందు చెప్పినవాడు.

అవున్రా అది నిజమే ఇంకా చాలామంది ఉన్నారు మన లిస్టులో ముందు దీని పనికి పడదాం అరేయ్ నేను ముందు వెళ్తాను అన్నాడో ఒకడు. ముందు నువ్వేంటి రా అందరం కలిసి ఒకేసారి వెళ్దాం అంటూ బాటిల్ లో ఉన్న నీళ్లు తీసి చైత్రముఖంపై కొట్టారు.

కాసేపటికి మెలకువ వచ్చిన చరిత్ర తనున్న పరిస్థితి చూసి తన చుట్టూ ఉన్నవారిని గమనించి అరేయ్ ఎవరు మీరంతా ఏంటిది నన్నేం చేస్తున్నారు నన్నేం చేయద్దు ప్లీజ్ అంటూ ఏడవడం మొదలు పెట్టింది.

అది చూసి ఆ నలుగురు మేమెవరం కూడా నీకు తెలియదా నీ క్లాస్మేట్స్ మి రోజు మమ్మల్ని చూస్తున్నావు కదా అయినా మేమంటే నీకు లెక్క లేదులే ఎన్నిసార్లు ప్రేమించామని వచ్చినా కూడా మమ్మల్ని కన్నెత్తి కూడా చూడలేదు నీకు ఎలా గుర్తుంటాము ఇప్పుడు బాగా చూసుకో ఇప్పుడు గుర్తుంటాంలే ఇక జన్మలో మర్చిపోలేము మమ్మల్ని అంటూ చైత్ర ఎంత అరుస్తున్నా మొత్తుకుంటున్నా బలవంతంగా నలుగురు ఆమెని అనుభవించారు.

మత్తు బాగా తలకెక్కడంతో వారిని ప్రతిఘటించలేక నిస్సహాయంగా వారికి బలైపోయింది చైత్ర. వారి నలుగురి పని అయిపోయిన తర్వాత తనని అలాగే మత్తులో ఉంచి తీసుకువెళ్లి వాళ్ళ ఇంటి ముందు అదే వ్యాన్ లో పడేశారు.

***********

తెల్లారుజామున ఎవరో అటుగా వెళుతున్న వారు చూసి గబగబా ఇంటి తలుపులు తట్టి చైత్ర నాన్నగారిని పిలిచారు. వాళ్లు వచ్చి చూసి ఏడుస్తూ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లబోతే తీసుకెళ్లారు.

తనను ఆ స్థితిలో చూడగానే జరిగిందేమిటో వారికి అర్థమైంది. వాళ్లకు చెప్పినా ఆ పెద్దాయన. ఆ కాలనీలో ప్రెసిడెంట్ గా ఉంటున్నాడు గత 30 ఏళ్లుగా వామనరావు దంపతుల గురించి వారి సాంప్రదాయం గురించి వారి నెమ్మదితనం గురించి తెలిసిన వెంకట్రావు గారు. చైత్రను లోపలికి తీసుకువెళ్లిన తర్వాత లోపలికి వచ్చి కూర్చుంటూ వామనరావు దంపతులను పిలిచాడు.

వాళ్ళిద్దరూ ఏడుస్తూ వచ్చి ఆయన ముందు కూర్చున్నారు. చూడండి మన అమ్మాయి ఎవరు మన అమ్మాయిని ఎవరో ఏమో చేశారు అని మనకు అర్థమవుతుంది ఈ విషయం బయటకు తెలిస్తే రభస అవుతుంది కాబట్టి ఏమీ తెలియనివ్వకుండా మీరు మామూలుగా ఉండండి. మీ అమ్మాయికి కూడా నచ్చజెప్పండి పోలీసులు కేసు అని అంటే మీ 30 ఏళ్లుగా ఉన్నా మీ జీవితం అంతా రోడ్డున పడుతుంది అందరూ చీత్కారంగా చూస్తారు అలాగే అమ్మాయి జీవితం నాశనం అవుతుంది.

కాబట్టి జరిగిందేదో జరిగింది అది ఒక పీడకలగా మర్చిపోండి ఒక తండ్రిగా ఒక పెద్దగా ఈ విషయం మీకు చెప్పడం నా ధర్మం. అమ్మాయి స్పృహలో లేదు కాబట్టి తనకేం జరిగిందో కూడా గుర్తుండి ఉండదు. మీరు కూడా ఏం జరగనట్లే ప్రవర్తించండి అంటూ హితవు చెప్పారు. దానికి వామనరావు గారు లేదండీ ఈ అన్యాయాన్ని నేను ఎలా సహించాలి దాన్ని చూస్తూ రోజు చూస్తూ కుమిలిపోవడం కన్నా బయటపెట్టి ఆ దోషులను పట్టించడం మంచిది.

వాళ్లు ఇంకెందరి జీవితాలు నాశనం చేస్తారో అలా నాశనం చేయకుండా జైల్లోనే మగ్గిపోవడం మంచిది అన్నారు ఆవేశంగా, అవునండి అదే నిజం ఆ నేరస్థులు ఎవరో తెలియాలి వాళ్ళకి శిక్ష పడాలి అంది సరస్వతి గారు. అమ్మ ఆమెపై దాడి చేసింది ఎవరో ఆమెకి కూడా తెలుసో లేదో తెలియదు వారిని గుర్తు పడుతుందో లేదో కూడా తెలియదు అమ్మాయికి ఇచ్చిన మత్తు చాలా ఎక్కువగా ఉన్నట్టు ఉంది అనవసరంగా బయటపడడం కంటే ఏమీ తెలియనట్లుగా ఉండిపోవడం మంచిది.

ఆ దోషులు ఎవరో గుర్తుపట్టాలి ఒకసారి పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కితే ఇంక జీవితాంతం అందులోనే మగ్గాల్సి వస్తుంది. మీ మంచి కోరి చెప్పాను, బాగా ఆలోచించుకోండి అంటూ వెళ్లిపోయారు వెంకట రావు గారు. ఆయన వెళ్లాక తలుపులు వేసి వచ్చిన వామనరావు ఏం చేద్దాం అన్నట్టు భార్య వైపు చూశారు ఏమో నండి నాకేమీ అర్థం కావడం లేదు వారు పెద్దవారు అన్ని తెలిసినవారు చెప్పింది కూడా సబబు గానే ఉన్నట్టుగా ఉంది అంది సరస్వతి. ఇద్దరూ ఆలోచిస్తూ అలాగే కూర్చుండి పోయారు.

ఉదయం 12 గంటలకు చైత్రకు మెలుకవచ్చి మెల్లిగా లేచి కూర్చుంది తలంతా దిమ్ముగా తననేదో మత్తు ఆవరించినట్టుగా ఉంది. తల విధించి తెలివి తెచ్చుకొని చుట్టూ చూసింది. అప్పుడు అర్థమైంది తన ఇంట్లో తానే ఉంది అన్నట్టుగా, పైగా తనకు జరిగిన అన్యాయం కూడా మెల్లమెల్లగా గుర్తుకు రాసాగింది తను అసలు ఇంటికి ఎలా వచ్చింది అనేది కూడా తనకు అర్థం కాలేదు లేచి మెల్లిగా హాల్లోకి వచ్చింది.

ఆమె అలికిడి వినగానే దంపతులిద్దరూ దగ్గరగా వచ్చి ఏమ్మా లేచావా అంటూ దగ్గరకు తీసుకున్నారు. ఏమైందమ్మా నాకు అంటూ అడిగింది చైత్ర. ఏమీ లేదమ్మా నాన్నగారు నిన్ను బయట నుండి తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది నీకు బాగా దెబ్బలు తగిలాయి అంతే అంటూ కవర్ చేసింది సరస్వతి.

వామనరావు గారు భార్య మొహం వైపు చూస్తూ అవునవును బైక్ పై వస్తుంటే స్కిడ్ అయ్యి నువ్వు కింద పడ్డావు, నాకు దెబ్బలేమి తగలలేదు కానీ నీకే దెబ్బలు తగిలాయమ్మ సారీ అందుకే ఇంతసేపు పడుకున్నావ్ అందుకే ఈ గాయాలు వెళ్లి ఫ్రెష్ అప్ అయి రాపో సరస్వతి అమ్మాయికి వెళ్లి వేడివేడిగా టీ చేసి ఇవ్వు అన్నాడు.

తనకు అంతా గుర్తుకొస్తున్నా కూడా ఇంకా మత్తులోనే ఉండడం వల్ల తల్లిదండ్రులు చెప్పిందే నిజమని నమ్మిన చైత్ర మెల్లిగా బాత్రూంలోకి వెళ్ళింది. బ్రష్ చేసి మొహం కడుక్కుంటుంటే మట్టంతా మెల్లమెల్లగా వదల సాగింది ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయి. అలాగే బట్టలు విప్పేసి స్నానం చేయాలనుకుని తన బట్టల వైపు చూసుకుంది. అవన్నీ నలిగిపోయి చిరిగి ఉన్నాయి.

స్నానం చేస్తున్నప్పుడు తన ఒంటిపై ఉన్న గాయాలను చూసుకుంటూ జరిగింది ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి మత్తంతా వదలడంతో తను ఆనంది రోడ్డుపై నిలబడడం ఆనంది వాళ్ళ నాన్నతో వెళ్లడం ఆ తర్వాత ఎవరో తనానికి కిడ్నాప్ చేయడం అన్నీ గుర్తొచ్చాయి చైత్రకి. బాలు తనని పాడు చేయడం తను బ్రతిమాడడం అన్నీ గుర్తొచ్చాయి కానీ అమ్మానాన్న ఇలా అంటున్నారు ఏంటి అని ఆలోచిస్తూనే స్నానం చేసి డ్రెస్ వేసుకొని బయటకు వచ్చింది ఈలోపు సరస్వతి గారు టీ తీసుకొచ్చి చైత్ర కి ఇస్తూ, చుచాయిగా అమ్మ చైత్ర జరిగినవన్నీ మర్చిపో…. ఈ రెండు రోజులు రెస్టు తీసుకో….

మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అంటూ చెప్పింది. ఒక ఆడపిల్ల తన మీద జరిగిన అఘాయిత్యాన్ని తన చేతిని తన శరీరాన్ని చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది అనే ఉద్దేశం ఆడవారికి తెలుస్తుంది కాబట్టి తల్లిగా చెప్పి చెప్పినట్టుగా చెప్పింది. అవునమ్మా చైత్ర మీ అమ్మ చెప్పినట్టుగా రెండు రోజుల్లో మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం. ఎలాగో నీ చదువు అయిపోయింది కాబట్టి జాబ్ చూసుకుందువు గానీ అంటూ తండ్రి కూడా హెచ్చరించాడు.

అంటే తనకు జరిగిన విషయం తల్లిదండ్రులకు అర్థమైంది అని చైత్ర కూడా అర్థమై ఏంటి నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు జరిగింది మర్చిపోవాలా? ఇది నా జీవితం నాన్నా ఎలా మర్చిపోవాలి. రేపు పొద్దున వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకోవాలి? ఎవరో ఏదో చేస్తే దానికి నా జీవితాన్ని బలి ఇవ్వాలా వాళ్ళు బయటే ఉంటూ నాలాంటి వారిని ఇంకేందరినో నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా ఇదేనా నాన్న మీరు ఒక టీచర్ గా విద్యార్థులకు నేర్పించేది. విద్యాబుద్ధులు ఏది మంచి ఏది చెడు నేర్పే గురువే ఇలా సర్దుకొమ్మంటుంటే చాలా బాధగా ఉంది నాన్న అంటూ ఏడవ సాగింది చైత్ర.

నిజమే తల్లి నేను విద్యార్థులను తీర్చిదిద్దేవాడిని కానీ నా కూతురు జీవితాన్ని కాపాడలేకపోయాను అందుకే నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తున్నాను కానీ ఒకటి ఆలోచించు ఇప్పుడు బయట వాళ్ళని నువ్వు గుర్తుపట్టగలవా? ఒకసారి పోలీస్ స్టేషన్ కి ఒక ఆడపిల్ల పోలిస్ స్టేషన్ కి వెళితే జనం, చుట్టాలు, సమాజం ఎలా చూస్తుందో నీకు తెలియనిది కాదు. ఈ సమాజం అంటే పడే మాటల కన్నా ఇలా ఊరుకోవడం ఉత్తమం. అదొక పీడకలగా మర్చిపో అని అన్నారు వామన రావు గారు.

లేదు నాన్న ఎలా ఊరుకోగలను నాకు జరిగిన అన్యాయానికి వారికి శిక్ష పడాల్సిందే నేను అస్సలు ఊరుకోను వాళ్ల మీద కేసు పెడతాను అంది చైత్ర. అవునమ్మా చైత్ర అదే నిజం నిజానికి నేనే మీ వాళ్లకి సలహా ఇచ్చాను. కానీ ఇంటికి వెళ్లి ఆలోచిస్తే నాకు కూడా అర్థమైంది ఇలాంటి దోషులను వదిలేస్తే ఇంకా ఎంతమంది ఆడవాళ్ళ శీలాన్ని దోచుకుంటారు అని అర్థమైంది నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచించి మళ్లీ నా నిర్ణయం మార్చుకున్నాను కదా మనం వెళ్లి కేసు పెడదాం అంటూ వచ్చారు వెంకట్రావు గారు.

************

చైత్ర, వెంకట్రావు, వామనరావు ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టారు. పోలీసులు మీరు వాళ్ళని గుర్తుపట్టగలరా అని చైత్రని అడిగారు. అవును నేను గుర్తు పడతాను అని చైత్ర అనగానే ఆమె క్లాస్మేట్స్ అందర్నీ పోలీస్ స్టేషన్ కి పిలిపించారు.

అయితే విషయం తెలిసిన కాలేజీ యజమాన్యం వారు మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు మేము చాలా క్రమశిక్షణతో ఉంటామంటూ చైత్ర అబద్ధం ఆడుతుంది తనకి చాలా పొగరు. అసలు కాలేజీలో సరిగా ఉండేదే కాదు తిరుగుబోతు అంటూ ఏవేవో చెప్పారు. తమ కాలేజీ బరువు తీసింది అంటూ ఆమెపై లేనిపోని అబాండాలన్నీ వేశారు. ఇది ఊహించని చైత్ర బిత్తర పోయింది.

చేసింది కొంచెం బడా బాబుల పిల్లలు కాబట్టి వాళ్లు ఇంకా ఊర్లో ఉంటారా వాళ్ళు ఎక్కడికో జారుకున్నారు. పోలీసులు పిలిపించిన వారిలో చైత్ర ఎవరిని గుర్తుపట్టలేక పోయింది. కాలేజీ యజమాన్యం కూడా పిల్లల్ని బెదిరించి తప్పుడు సాక్ష్యం చైత్ర మీదే ఇప్పించింది. చైత్ర మంచిది కాదంటూ చాలా అహంకారి, పొగరు కలది అంటూ అందరితో గొడవలు పెట్టుకునేదంటూ తన స్నేహితులే సాక్ష్యం చెప్తుంటే బిత్తర పోయింది చైత్ర.

చైత్ర ఎవరిని గుర్తుపట్టలేకపోవడం సాక్షాలు ఏవి అక్కడ దొరకకపోవడంతో, అలాగే మెడికల్ చెక్ అప్ ఏమీ లేకుండానే పోలీసులు కూడా ఇది తప్పుడు కేసు గానే నిర్ణయించారు. కావాలనే చైత్ర ఇలా చేస్తుందని వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మీరు కావాలని కాలేజీని పరువును పోగొడుతున్నారు ఇలా చేయడం తగదు అంటూ పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చారు.

ఇవన్నీ చూసిన చైత్ర తన స్నేహితులే తనని మోసం చేస్తుంటే తట్టుకోలేకపోయింది. వీళ్ళందరూ ఇలా ఎందుకు మారారు. బెదిరిస్తే మారిపోతారా తోటి స్నేహితురాలికి అన్యాయం జరిగితే ఊరుకుంటారా అంటూ ఆ క్షణంలో తను పడిన నరకయాతన కన్నా ఇప్పుడు వీళ్ళు ఇలా మోసం చేస్తూ తనపై నిందలు వేస్తుంటే సహించలేక ఇంకా నరకయాతన పడసాగింది.

ఇదంతా కేవలం ఒక్క రోజులోనే జరగడంతో అందరికీ పిచ్చెక్కిపోయి ఏం చేయాలో ఆలోచించలేని స్థితిలో ఉండిపోయారు. వెంకట్రావు, వామనరావు గారు ఇద్దరు మాట్లాడుకుంటూ మనం ముందే అనుకున్నట్టు ఊరుకుంటే అయిపోయేది అనవసరంగా ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డాము అని అనుకుంటుంటే అప్పుడే అక్కడికి సరస్వతి గారు వచ్చి. ఏమండీ వీళ్ల వల్ల మనకు న్యాయం జరగకపోతే మానవ హక్కుల చట్టం అనేది ఒకటి ఉంది కదా అక్కడికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందేమో అని అన్నారు.

దానికి వెంకట్రావు గారు అవునమ్మా చాలా కరెక్ట్ గా ఆలోచించావు. వామనరావు వెళ్లి మనోహక్కుల కమిషన్ లో మనం రిపోర్ట్ చేద్దాం అంటూ వెళ్లి మానవ హక్కుల కమిషన్ ఆఫీసుకు వెళ్లి జరిగిందంతా చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అలాగే పోలీసులు కాలేజీ యజమాన్యం వాళ్ళు చెప్పిన విషయాలు కూడా అన్ని పూసగుచ్చినట్టు చెప్పి మాకు న్యాయం జరిపించండి అంటూ కోరడంతో మానవ హక్కుల కమిషన్ లో ఉన్నది ఒక మహిళ కాబట్టి ఆమె సుమోటోగా కేసు తీసుకొని చైత్రని మెడికల్ టెస్ట్ కి పంపింది.

మెడికల్ టెస్ట్ లో చైత్ర పై అఘాయిత్యం జరిగింది అని నిజం తెలియడంతో పాటు చైత్ర మత్తు పూర్తిగా దిగి తనని బలవంతం చేసిన వారి పేర్లు కూడా బయట పెట్టింది. దాంతో మానవ హక్కుల చట్టం పోలీసులను వారిని తీసుకురమ్మని ఆదేశించారు. ఒక్కసారి కేసు మానవ హక్కుల కమిషన్ కి వెళ్తే దానికి తిరుగు ఉండదు కాబట్టి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు చేయాలి. అందువల్లే గోవాలో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ నలుగురిని వెంటనే ఇక్కడికి రప్పించారు. బడా బాబుల కొడుకులయిన వాళ్ళ తండ్రులు తమ కొడుకులను కాపాడాలని విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు.

మెడికల్ టెస్ట్ లోనే డిఎన్ఏ వాళ్ల డిఎన్ఏ తో సరిగ్గా కుదరడంతో వాళ్లే దోషులని తేల్చారు మానవ హక్కుల సంఘం వాళ్లు. వాళ్లని పోలీసులకు సరెండర్ చేసి అరెస్టు చేయమని కోరారు పోలీసులు వాళ్ళని అరెస్టు చేశారు. కానీ వాళ్ళు పెద్దవారి కొడుకులు కాబట్టి వారికి బెయిల్ రావడం చాలా తేలిక కాబట్టి చైత్ర వారికి శిక్ష విధించాలి అని కోరింది. బెయిల్ ఇవ్వకూడదు అంటూ తను మరో పిటిషన్ వేసింది. కానీ ఈ సాక్షాలు సరిపోవని వేరే ఎవరైనా సాక్షాలు చెప్తే వాళ్లకి బెయిల్ రాకుండా చేయగలమని మానవ హక్కుల కమిషన్ చెప్పడంతో చైత్ర లో ఒక నిర్ణయం తీసుకుంది.

ఆ తర్వాత తన గురించి తన స్నేహితులే తప్పుగా ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి ఈ నరక యాతన నుండి తను వెంటనే తప్పించుకోవాలి వేరే ఆడపిల్లలు ఇలా శీలం పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో కాలేజీ ముందు నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టింది.

కాలేజీ వాళ్లు పోలీసులు తనని ఎంతగా బెదిరించాలని చూసినా తను అస్సలు తగ్గకుండా మీకే ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా నన్ను ఎందుకు అందరూ తప్పుగా చూపించారు నాతో కలిసి చదువుకున్న నా స్నేహితులే నన్ను ఎందుకు మోసం చేశారు. ఇప్పటికైనా బెదిరింపుల నుండి బయటకు రండి బెదిరించినంత మాత్రాన మీ ప్రాణాలేవి పోవు ఒకరి ప్రాణం పోయినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు నా ప్రాణం పోయినా సరే కానీ మీరు మాత్రం నిజం చెప్పాలి.

ఇలా మీ ఇంట్లో జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా అంటూ నినాదాలు చేస్తూ తన స్నేహితులను తనకు న్యాయం చేయమంటూ కోరింది. నిజం నిప్పులాంటిది అది వారిని కాల్చివేస్తుంది తమ ముందే తిరిగిన తమ స్నేహితురాలు నిరాహార దీక్ష చేస్తూ తనకు న్యాయం కావాలంటూ కోరడంతో స్నేహితుల్లో కూడా మార్పు మొదలైంది.

మెల్లిగా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కాలేజీ యజమాన్యం తమను బెదిరించింది అని రాజకీయ నాయకుల ద్వారా బెదిరించి తమ ప్రాణాలు తీస్తామంటూ అనడం వల్లనే తాము చైత్ర గురించి చెడుగా చెప్పాము అంటూ వాగ్మూలం ఇచ్చేసరికి మానవ హక్కుల చట్టం పోలీసులను వారికి బెయిల్ ఇవ్వకుండా జీవితాంతం జైల్లోనే మగ్గేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. అలాగే కోర్టుకు కూడా వాళ్లకి ప్రాణభిక్ష అసలు పెట్టొద్దు అని కోరింది.

ఇదంతా కేవలం ఒక్క రోజులోనే జరిగింది కాదు. కానీ చైత్ర తాను అనుకున్నది సాధించాలని నిందితులకు శిక్ష పడాలని కోరుకోవడం వల్లనే ఆమె నిజాయితీని చూసిన జనాలు ఆమెకు నీరాజనం పట్టారు. అంతేకాకుండా దేశంలో మొదటిసారి ఇలా జరగడం వల్ల ప్రజలందరూ కూడా చైత్రకు అండగా నిలిచారు. వారు కూడా దోషులను శిక్షించాలి అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు ఇక ఏమీ చేయలేక రాజకీయ నాయకుల ఆటలు చెల్లక, నేరం చేసిన వారికి యావజ్జీవ శిక్ష వేశారు.

మనలో నిజాయితీ ఉంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు.

ఇక్కడ చైత్ర గెలిచింది కానీ తన జీవితాన్ని, శీలాన్ని కోల్పోయింది. ఆమె ఆ విషయం తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు. ఆమె మర్చిపోవాలనుకున్నా ఆమె జీవితంలో అదొక మచ్చలాగా మిగిలిపోయి, జీవితాంతం నరకయాతన పడుతూనే ఉంటుంది. దీన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే ఇది మనసుకు సంబంధించింది కాబట్టి.

– భవ్యచారు

Related Posts