నవ్వులు

నవ్వులు

నవ్వు నాలుగు విధాల చేటు
అంటారు పెద్దలు కాని
దాని పరమార్థం మాత్రం
ఎలా ఎప్పుడు అని

నవ్వుతూ బ్రతకాలిరా
అని అంటే మనో దైర్యం
గా జీవించడం అన్నట్టు

పసి పాపల ముఖంలో
బోసినవ్వు కనిపిస్తుంది

చిన్నపిలలల్లో చిలిపినవ్వు
ఏమార్చి చేసేపనుల్లో
కొంటేనవ్వు
ఎదురుపడే వేళ
పలకరింపుల నవ్వులు

మనసు మాటున సంగతులు చెప్పే
ముసి ముసి నవ్వులు

సంతోషాల సమయంలో
సరదాల నవ్వులు

ఎదుటి వారి భావనతో
పనిలేనిది అపహాస్యపు నవ్వు

ఆత్మ నిబ్బరంతో వచ్చేది
అట్టహాస ప నవ్వు

తెలియని సంబరంలో
తేలికగా వచ్చేది
ఆశ్చర్యం నవ్వు

అసూయపు ఆలోచనల
లోతుల్లో వచ్చేది
ఏడుపుగొట్టు నవ్వు

మర్మమేరుగాని మనిషి
కడుపుబ్బా నవ్వు
అంతరార్థం తెలియనిది
అమాయకపు నవ్వు

కోపానికి విరుగుడు
మరి మరి నవ్వు

ఎన్ని రకాలుగా నవ్వినా
లాభం మాత్రం మనకే
అది శక్తివంతమైన
దివ్య ఔషధం మరి

ఉల్లసాల సిరులు
పెదవులపై చిరునవ్వు

ఖర్చు లేని ఖరీదైన
ఆత్మీయతల పలకరింపు
మనసారా నవ్వగలిగితే
మనమిచ్చే విలువైన కానుక

నవ్వులాటగా కాకుండా
నవ్వుల భాటగా సాగాలి
మనిషి జీవితం ……..

– జి జయ

Related Posts