నీ ఎడబాటు

నీ ఎడబాటు

నిమిషాలన్నీ రోజులుగా గడుస్తున్నాయి
రోజులన్నీ ఇలా నెలలవుతున్నాయి
కరుగుతున్న కాలమంతా భారమవుతుంది
నీకై చూసే ఎదురుచూపులు ఆగకున్నాయి

మదిలో మెదిలే ఆశలన్నీ నీకోసమే
ఎదలోని నా సొదలన్నీ నీ ఊసులే
రాస్తున్న ఈ అక్షరాలన్నీ నీ వర్ణనలే

భాష చాలక సతమతమవుతున్నా
భావం కుదరని లేఖలు రాస్తూనే ఉన్నా
ఎడబాటులోని విరహాలను భరిస్తున్నా
గతంలోని స్మృతులు కవ్విస్తుంటే నవ్వేస్తున్నా

కలకాలం కలసిబతకాలని వేచున్నా
సరిగమల గమకాలుగా సాగాలని కలగన్నా
సాహిత్యపు లోతులు చూపాలని రాస్తున్నా
తోచని రాతలన్నీ నీకే అంకితమిస్తున్నా
నిన్నలేని‌ చీకట్లలో బతికేస్తున్నా..
నీ నవ్వుల వెలుగులకై ఎదురుచూస్తున్నా…

– ఉమా మహేశ్వరి

Related Posts