నీ నగవులో

నీ నగవులో

కలలో కనిపిస్తావు అప్సరలా
ఎదుట నిలువవు ఎందుకనో!

కావాలని ఏడిపిస్తావు అగుపడకనే
ఏమిటా తెగువో తెలియదు ఏనాటికీ!

నాలో నిండిన ప్రేమకి రూపానివై
నిత్యం కనబడతావు నిశీధీలో
ఒకటే యాతన రేపుతావు
నా మది కుహరంలో…

చిరునగవులు చిందే మోమున
కాటుక కనులు అల్లరిగాను
అధరాలు అలవోకగానూ
మందహాసం చేస్తుంటే…

అవే నా జ్ఞాపకాలుగా మిగిలాయి ఎందుకనో
నీవే నా జీవితంగా మారావు ఏ జన్మ ఫలానివో!

మరి నా ఎదుటపడేదెపుడని
నాతో నడిచే క్షణాలెపుడని
నీతో జీవించే రోజులేనాడని
మరపులేని మధురానుభూతులని
నీతో కలసి నింపుకోవాలని
వేచి చూస్తున్నాను
నీతో కలసి జీవించే క్షణాల కోసమని.

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts