నీ నవ్వు

నీ నవ్వు

నీ నవ్వు నామదిని ఉత్సాహంగాఉండేలా చేస్తుంది

నీనవ్వు నీఉనికినితెలియచేస్తుంది

నీ నవ్వు ఉప్పెననుకూడాతుడిపేస్తుంది

నీ నవ్వు
కనులకు హాయినిస్తుంది

నీ నవ్వు
మనసుకు తృప్తి నిస్తుంది

నీ నవ్వు ఆకాశమంతఆనందాన్నిస్తుంది

నీ నవ్వు
నా ముఖచిత్రమైవెలుగుతుంది

నీ నవ్వు
ప్రతిబింబమై చేరుతుంది

నీ నవ్వు
విప్పనిభావానికిసంకేతమవుతుంది

నీ నవ్వు
పలకబోయే మాటకు మంత్ర మవుతుంది

నీ నవ్వు
కనుల సంతకమై ముద్రిస్తుంది

నీ నవ్వు ఏదైనా అదృష్టపు
అంచులకు చేరవేస్తుంది కదూ!

– జి జయ

Related Posts