నీ రాక కోసం

నీ రాక కోసం

చిరకాల చిన్మయ స్నేహితుడా…
చెరగని చిరునవ్వు చిరంజీవుడా…

నీ నవ్వు వెనుక దాగిన
ఈదేశం కోసం నువ్వు చేసిన త్యాగం మానవుడు ఉన్నంత కాలం ప్రతి నోట చిరస్మర నియమం.
బాపు నువ్వు ఎక్కడా !

నువ్వు నడిచిన సన్మార్గం అనే పట్టాలు పక్కకు తప్పి

ఈ దేశం అతలాకుతలం అయోమయ స్థితిలో రాక్షస మార్గంలో నడిచి

పాపం పండి ఆకాశంలో తారల నేలన రాలుతున్నాయి మానవుడి మరణాలు…..

నీ మాట ఎక్కడా…
నీ బాట ఎక్కడా…
ఇపుడు ఉన్న పరిస్థితిలో
నలు వైపులా నల్లటి చీకటి అలుముకుని ఏ దారిన పోవాలో అర్థం కావడం లేదు.

కరుగుతున్న కాలాన జరుగుతున్న ప్రయాణ మానవుడిలో మారిన ఆలోచనకు

నీ మాట… నీ బాట …
నీ నవ్వుల మూట అమ్మ ప్రేమలా శక్తిని ప్రసాదించిన
నీ మార్గాన నడిచేలా
ఏ రూపాన వస్తావో అని ఎదురు చూస్తున్నం బోసి నవ్వుల బాపు…

– దేవి మోహన్

Related Posts