నీ రూపం

నీ రూపం

శుభోదయం అంటున్న రవి కిరణాలు..
సరికొత్త రోజులకవి చిరునామాలు..
కొంగోత్త అనుభవాలకు ఆనవాలు..
పరిగెత్తిస్తాయి మన జీవన చక్రాలు..

నీ వెచ్చని ప్రకాశపు వెలుగులు..
మమ్ములను ఆద్యంతం మేలుకొలుపు..

కొండలపై ఉదయించే నీ రూపం..
మా కనులకది అపురూపం..
ఎందరికో ఆరాధ్యం నీ విశ్వరూపం..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts