"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

నీ సత్తా చాటుకో

నీ సత్తా చాటుకో

నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. నిన్ను నువ్వు ఇష్టపడాలి. ప్రపంచానికి నువ్వు ఏంటో నిరూపించడానికి ముందు నీ  గురించి పూర్తి తెలుసుకుని  నీ గమ్యం మీద దృష్టి పెట్టాలి. నీ జీవితంలో ఏం జరిగిన నీ మంచి కోసమే అని అనుకుంటూ…
ధ్యానం చేస్తే మౌనం , ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.

ఏ విషయం గురించి అతి ఆలోచిస్తూ ఎక్కువ ఒత్తిడి లోనవ్వకుండా జాగ్రత్త పడుతూ నువ్వు ఏం చేయాలని అనుకున్నానో , ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకుని ,నీ గురించి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నిన్ను నువ్వే ఇష్టపడుతావు. ఎవరు ఏదైన చెప్పితే అది నిజమో , కాదో తెలుసుకుంటే ఎవరు ఎలాంటి వాళ్ళో నీకే అర్థం అవుతుంది.

నీ మనసుకు నచ్చిన పాటలు విను. నీకు నచ్చింది చేయి. అందరూ నచ్చింది చేయకపోవచ్చు కానీ మమ్మల్ని అర్థం చేసుకున్నా వాళ్ళు ఒకరైన ఉంటారు. కొందరు చాలా తెలివిగా సమాధానం ఇస్తారు. మరికొందరు మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికే భయం పడుతుంటారు.

అందుకే నీతోనే నువ్వే ఎక్కువ సమయం గడుతూ నీకు ఏం కావాలో , ఎటు వైపు నీ అడుగులు వేయాలో నీకే అర్థం అవుతుంది. నీకు ఏం చేయాలో చెప్పవలసింది ఎవరో కాదు , నీకు నువ్వే చెప్పుకోవాలి. నీకు నువ్వే నిర్ణయం తీసుకోవాలి.
ఎప్పుడైతే నిన్ను నువ్వు జయించగలుగుతావో నీ తెలివి తేటలు తో మొదలు పెట్టిన ప్రతి అడుగు నీ విజయానికి సోపానాలు అవుతాయి.

ఒకరి ప్రవర్తన నచ్చకపోతే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్లని మార్చడానికి ప్రయత్నం చేయరు.
అందరూ ఒకేలా ఉండరు. కానీ ఒకరు సూటిగా , నిర్మొహమాటంగా మాట్లాడతారు. మరొకరు మొహమాటంగా మాట్లాడుతూ మాట్లాడుతారు.

అలాంటి వాళ్ళు ఎందరో. నీకు నువ్వే అర్థం అయితే ఇతరులను అర్థం చేసుకోవడం సులువు అవుతుంది.
ఏ విషయాల్లో అయినా అందరూ ఒకేలా స్పందిస్తారు అని చెప్పలేం. నిన్ను నువ్వు జయించుకో తర్వాత ప్రపంచానికి నీ తెలివి తేటలు తో నీ సత్తా చాటుకో..

– మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *