నీ తోడు కోసం

నీ తోడు కోసం

నీ మాట వినిపించని క్షణానా
నీ నవ్వు కనిపించని క్షణనా
నీ రూపాన్ని మదిలో దాచుకుని
నీ మాటలన్నీ ప్రోగు చేసుకుంటూ
నీ పలుకులన్ని మననం చేస్తూ
నీలో నన్ను చూసుకుంటూ
నాలో ఉన్న నిన్ను,
నీలో ఉన్న నా కోసం
నీ మాటల కోసం
నీ తలపుల నావ
నాలోనా ప్రవశింపగా
నే వేచి చూస్తున్నా నీ కోసం
నీ తోడు కోసం…

– అర్చన 

Related Posts