నీ తోడుగా నేనుంటా.!

నీ తోడుగా నేనుంటా.!

నీ స్పర్శలో ఏదో తెలియని మాయ ఉంది
నీవు తాకిన ప్రతిసారీ నాకు తెలుస్తోంది
నీ పలుకులో ఏదో మత్తు ఉంది
నీ కౌగిలిలో తెలియని అమితమైన ఆప్యాయత ఉంది
నీ గుండెలను హత్తుకుంటే ఎంతో హాయిగా ఉంది
నీ అదర చుంబనంలో‌ నాపై ఉన్న ప్రేమ ఉంది
నిత్యం నను వదలక నీవు చూపే బాధ్యతలో..
నీవు నను పిలిచే పిలుపులో వాత్సల్యం ఉంది
నీ ఒడిలో ఎంతసేపైనా నాకు సమయం తెలీదు
నీవు లేకుంటే నాకు రోజులో క్షణం కూడా తోచదు
నీ చెక్కిలిపై ముద్దాడే వేళ నీ బుగ్గల్లో కనిపించే సిగ్గు
నా చెవిలో నీవు చెప్పిన ఊసులు‌..

నీ ముంగురుల సవ్వడులను నేను మరవను ఈ జన్మలో..
తనువులు దూరమైనా..

కలవని దిక్కులో మనమున్నా..

నాకోసమే నువ్ పుట్టావని కలగంటూనే ఉంటా..

జీవితాంతం ‘నీ తోడు’ గా నేనుంటా.!

– ది పెన్

Related Posts