నీకై ఎదురు చూసే నీ నేను

నీకై ఎదురు చూసే నీ నేను

వర్షిణి ఆఫీస్ నుంచి బయటకు నడిచి వస్తుంటే ఎదురుగా ఒక బొమ్మ ని చూసి ఆగిపోతుంది.. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి ఏమి అయింది అలా ఉండిపోయావు అని అంటుంది…

వర్షిణి అలా కాసేపు ఉండిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి తన బ్యాగ్ తడుముతుంది… అందులో నుంచి ఒక కీ చైన్ తీసి చూసుకుంటుంది.. తన కన్నీటికి అంతం లేకుండా ఏడుస్తూ వుంటుంది..

తన ఫ్రెండ్ కి ఏమి జరిగిందో తెలుసుకోవాలి అనుకొనే లోపు తను బయట చూసిన బొమ్మ వర్షిణి బ్యాగ్ పక్కన ఉంటుంది. తన ఫ్రెండ్ కి కళ్ళు తిరిగినంత పని అవుతుంది.

వర్షిణి మాత్రం బొమ్మ ని ముట్టుకొనే ధైర్యం చేయలేక అక్కడి నుంచి వెళ్లలేక గతం లోకి వెళ్తుంది… కానీ బొమ్మ వర్షిణి ని వెళ్లనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది. అసలు ఈ బొమ్మ కి వర్షిణి సంబంధం ఏమిటో అర్ధం కాదు తన ఫ్రెండ్ కి.

వర్షిణి మాత్రం ఏమి తెలియనట్లు రోజు ఆఫీస్ కి వస్తూ రూమ్ కి వెళ్తుండేది… అలా రోజులు గడుస్తువుంటాయి. వర్షిణి లో మార్పు మొదలవుతుంది.. వాళ్ళ ఇంటికి విషయం తెలియచేయాలి అని తన ఫ్రెండ్ ఉద్దేశం.. కానీ ఏమి జరుగుతుందో అర్ధంకాని స్థితి లో ఊరుకుంటుంది. తన ఫ్రెండ్ అలా అయిపోతుంటే ఏమి చేయాలో తెలియక తనకి వర్క్ లో హెల్ప్ చేస్తూ ఉంటుంది.

వర్షిణి ఆఫీస్ నుంచి రూమ్ కి వెళ్లి ఒక నాలుగు రోజులు ఆఫీస్ కి రాదు. ఐదవ రోజు ఆఫీస్ కి వెళ్తే టెన్షన్ గా తన ఫ్రెండ్ వచ్చి ఏమి అయింది అని అడుగుతుంది.

వర్షిణి చెప్పటం మొదలు పెడుతుంది. ఇన్ని రోజులు బొమ్మ ని కంగారుపడ్డాను. కానీ ఈ నాలుగు రోజులు అ బొమ్మ తోనే వున్నాను అంటుంది…. వర్షిణి ఫ్రెండ్ షాక్ లోకి వెళ్తుంది…

అప్పుడే వర్షిణి వెనకాల ఒక వ్యక్తి ని చూస్తుంది… ఫ్రెండ్ కి ఒక కార్డు చూపిస్తూ రిసెప్షన్ లో ఇచ్చి వెళ్ళిపోతాడు… పరిగెట్టుకుంటూ వెళ్లి అ కార్డు తీసుకోని చూస్తుంది.. పేరు చూసి క్షణం ఆలస్యం చేయకుండా వర్షిణి దగ్గరకి వస్తుంది.

వర్షిణి దగ్గరకి వచ్చిన తన ఫ్రెండ్ కార్డు చూపించి అడుగుతుంది… ఈయన ఎందుకు వచ్చారు అని మాత్రం అడుగుతుంది. అందుకు వర్షిణి మా అంకుల్ ఆయన కలవటానికి వచ్చారు అని వెళ్ళిపోతుంది. ఫ్రెండ్ మనస్సు ఎందుకో ఆందోళన గా ఉంటుంది. అర్జెంటు గా ఆయన ని కలవాలి అని బయటకి వెళ్తుంది.

కొంత దూరం ప్రయాణం చేశాక ఆయన ఇచ్చిన కార్డు లో అడ్రస్ కి చేరుకొంటుంది… ఆందోళన తో ఆయన దగ్గరకి వెళ్లి అడుగుతుంది. సార్.. వర్షిణి ఎందుకు అలా వుంది? ఎందుకు అలా ప్రవర్తిస్తోంది అని?

ఆయన చిన్నగా నవ్వి చెప్పటం మొదలు పెడతారు..

తను ఒక రకమైన భావన లో (భ్రమలో) ఉంది. తన యంగ్ ఏజ్ లో తన తండ్రి తో వున్న అనుబంధం తెగిపోయింది. అ డిప్రెషన్ లో తను అలా ఉండిపోయింది. ఇంక బొమ్మ అనేది తన తండ్రి తనకి ఎంతో ప్రేమ తో చిన్నతనం లో ఇచ్చినది.

అది ఇప్పుడు అనుకోకుండా కనపడటంతో ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దీనిని డిప్రెషన్ అనటం కన్నా తన తండ్రి మీద వున్న ప్రేమ అలా ఉండిపోయి తనకి తెలియకుండానే తన తండ్రి లేడు అనే నిజాన్ని నమ్మలేక భ్రమ లో ఉండిపోయింది.

సమస్య ఏంటి అంటే అ భ్రమ ఎక్కువై తన జీవితం మీద ప్రభావం చూపిస్తోంది. మంచిగా ప్రభావం కన్నా తనని తాను వదులుకొనే స్టేజి కి వచ్చింది. స్వబలం, స్వశక్తి, స్వాలోచన నెమ్మది గా పోతున్నాయి… తనతో నేను మొదటిసారి మాట్లాడినప్పుడు తను చెప్పిన మొదటి మాట నీకై ఎదురు చూసే నీ నేను…

నాకు అ పదం అర్ధం తెలుసుకోటానికి ఇన్ని రోజులు పట్టింది అంటాడు ఆయన. వర్షిణి ఫ్రెండ్ నన్ను కలిసిన మొదటిసారి తను ఇదే మాట చెప్పింది అంటుంది.

అంటే తన తండ్రి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ధైర్యం దూరం అవ్వటం వల్ల అందరిలో తన తండ్రి రూపమే కనపడుతూ ఉండటం వల్ల తన తండ్రి కోసం ఎదురు చూసే నీ కూతురు అని వర్షిణి అలా చెప్తోంది అని గ్రహిస్తారు ఇద్దరు.

వివరణ 

ఎంతమందివున్నా తనని కంటికి రెప్పలా కాపాడే వాళ్ళు వున్నా తండ్రి ఇచ్చే ప్రేమ, అక్కున చేర్చుకొని తన కౌగిలి లో వచ్చే ధైర్యం, మాటలు తన వెనక ఉండి నడిపించే కనిపించే అద్వితీయ శక్తి, తన జీవితాన్ని పూర్తి గా మనకే అర్పించి హరించిపోయే వెలుగు తండ్రి. తండ్రి వున్నప్పుడు లేనప్పుడు కూడా తండ్రి విలువ మరువకండి. తండ్రితో బిడ్డలు ఉంటే తప్పుడు ఆలోచనలు చేయకండి. 

తండ్రులు తప్పుడు ఆలోచన చేస్తే ఒక జీవితం నాశనం కావటానికి శత్రువులు అవసరం లేదు కన్నతండ్రి చాలు.

– సూర్యక్షరాలు
Insta : suryaksharalu

Related Posts