నీకునీవే

నీకునీవే

బ్రతుకు రంగుల రాట్నం పై
ఎక్కేది నీవే దిగేది నీవే
ఎత్తుపల్లాల నడుమ ఊగిసలాడేది నీవే
కష్టం నీవే సుఖం నీవే
కష్టసుఖాల మధ్య సంపద నీవే.
ఆనందం నీవే బాధ నీవే
సుఖదుఃఖాల మధ్య పయనం నీవే
గెలుపు నీవే ఓటమి నీవే
గెలుపు ఓటముల మధ్య పోరాటం నీవే
పరుగు నీవే పందెం నీవే
పరుగు పందెంలో విజయం నీవే
భయము నీవే ధైర్యం నీవే రెండిటి నడుమ అడుగులు నీవే
ప్రశ్న నీవే బదులు నీవే
ప్రశ్న జవాబుల మధ్య విషయం నీవే
కోపం నీవే తాపం నీవే
కోపతాపాలు నడుమ రాజీ నీవే
పాపం నీవే పుణ్యం నీవే పాపపుణ్యాల నడుమ ఓరుపు నీవే
బరువు నీవే బాధ్యత నీవే
బరువు బాధ్యతల నడుమ జీవితం నీదే
నాయకుడు నీవే ప్రతి నాయకుడు నీవే
రెండిటికీ ఒరవడి పెట్టే నటన నీవే
దర్శకుడూ నీవే నిర్మాత నీవే
నీ బ్రతుకు చిత్రంలో కథాకథనం నీవే
వెలుగు నీవే చీకటి నీవే
వెలుగు నీడల మధ్య వెన్నెల నీవే.
దైవం నీవే దెయ్యం నీవే
ఇద్దరి మధ్య ఆత్మవు నీవే
న్యాయం నీవే ధర్మము నీవే
కాలం చెప్పే తీర్పు నీవే
చెలిమి నీవే కలిమి నీవే
చెరగని చిరునవ్వుల చిరునామా నీవే.
నీకై నీవే నీతో నీవే
ఒంటరి బ్రతుకున ఓదార్పు నీవే.

– సలాది భాగ్యలక్ష్మి

 

Related Posts