నీళ్ళ తిప్పలు..

నీళ్ళ తిప్పలు

ప్రతి ఉదయం నీళ్ళకోసం
వెతకాల్సిందేనా అమ్మడూ.
ప్రతి రోజూ ఇలా ఎంతో భారం
మోయాల్సిందేనా అమ్మడూ.
తాగు నీటి కోసం నీటి తిప్పలు
మీరు పడాల్సిందేనా చెల్లెమ్మా.
నీ కష్టాలు తీరే ఆ రోజు కోసం
నువ్వెంత ఎదురుచూసావో.
నీ ఇబ్బందులు తగ్గే ఆ రోజు
కోసం నువ్వెంత ప్రాకులాడావో.
నీకోసం పాటుపడే నాయకుడే
నీ ముందుకు రానప్పుడు
నువ్వే నాయకురాలివి అవ్వు.
నీ హక్కులు నువ్వే సాధించు.

వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *