నీరాజనం

నీరాజనం

నీకై నా మనసు దర్పణం
నీతో నా మనువు తక్షణం

నీకై ఏదైనా భరిస్తా ఈ క్షణం
నిన్ను వదలను అనుక్షణం..

నేను అన్నది లేనిదే ఈ క్షణం
నువేమైపోతావో ఏ క్షణం..

భయమేగా మరి క్షణక్షణం..
అందుకే నేనున్నా ప్రతిక్షణం..

నీకోసం నా మనసు అనుక్షణం
తపిస్తూనే ఉంటుంది ఏ క్షణం..

నిన్ను తలవని క్షణం
దిగులుగా గడుస్తుంది దినదినం

నీకై నా ఊహల్లో ఆ క్షణం
చేసేస్తున్నా విహంగ వీక్షణం

నీకోసం తపించి తడిసెను ప్రతీక్షణం
అందుకే నేను నా సర్వం అర్పిస్తున్నా ఇది నిజం..

నీకై నా సర్వం అనుదినం..
అర్పిస్తున్నా నీకిదే నీరాజనం..!

 

– గాయత్రీభాస్కర్

Related Posts