నీరు కారిన రైతు గుండె

నీరు కారిన రైతు గుండె

వేసవి కాలం పూర్తి అయింది.. ఇగ వర్షాకాలం మొదలయింది.. పొలం దుక్కి దున్ని… పంటకు కావలసినవి అన్నీ సిద్ధం చేసుకున్నాను… పంట వేశాము విత్తనాలు వేసాము… కొన్ని రోజులకు మొలక వచ్చాయి.. మందులు చల్లాము.. పంట పచ్చదనం తో పలకరిస్తుంది.. ఎంతో సంతోషం తో ఉల్లాసంగా… ఇంకా పెట్టుబడి పెట్టాలి…

పోయి ఏడు పంట నష్టం బాగా వచ్చింది… ఆదుకుంటాం అన్నవారు హామీ ఇచ్చిన వారు కంటికి కూడా కనపడలేదు ప్రభుత్వాధికారులు… ఎం చేస్తాం నమ్ముకున్న పంట చేతికి రాలేదు.. అమ్మలా చూసుకున్న భూదేవి కరునించలేదు..

అలాంటిది.. ఈ అధికారులు ఎం చేస్తారు అని అప్పు ఇచ్చే వారిని నమ్ముకుని నా భార్య బిడ్డలకు కడుపు నింపడం కోసం అప్పులు ఎన్నో చేశాను.. రైతే రాజు అని గొప్పలకు నినాదాలు పలికే వారే కానీ ఆ రాజు నీ కనీసం మనిషిలా కూడా చూడడం లేదు ఎవరు.. రారేవరూ, చూడడేవరు, ఆదుకోరు ఇంకెవ్వరూ… అని గుండెని గట్టి చేసుకుని ఉన్న ఊరిని విడవలేక, మరో పని చేయడం తెలియక మాకు అన్నం పెట్టే వ్యవసాయాన్ని నమ్ముకుని మా రెక్కల కష్టం తో ముందుకు వెళ్తున్నాం కానీ దొక్కాడడం లేదు… ఎదుగుతున్న పిల్లలు… ఆకలి మంటతో ఎదురుచూస్తున్న కుటుంబం..

వీళ్ళ బాధ నీ చూస్తూ కన్నీళ్లు దిగమింగుకుని కష్టాలని ఆకలి గా భావించి మంచినీటిని తాగి కంటి నిండా నిద్ర లేకుండా రోజులు వెల్లదీస్తున్నం.. మళ్ళీ కాలం వచ్చి నెత్తిన కూర్చుంది.. ఈసారి అయినా కరుణించి ఆ దేవుడు మా కన్నీళ్లను తుడుస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాం.. మళ్ళీ అప్పులు చేద్దాం అంటే అప్పు ఇచ్చే వాడు లేడు.. ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు..

ఈయేడు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకున్నా.. మరుసటి రోజు లేచి పొలం దగ్గరికి వెళ్ళాను.. పంట అంతా చీడ వచ్చింది… పంట చెల్లా చెదురు అయింది… అది చూసి నా గుండె బరువెక్కింది… పంట కొట్టడానికి తెచ్చిన పురుగులమందు నాకు ఆహారం అవుతుందా అని స్వీకరించాను.. ఇది చూసిన నా భార్య కన్నీరు మున్నీరు అయి నన్ను కాపాడుకోవడానికి ఎన్నో చేసింది.. చివరికి నేను తనలో కట్టిన తాళి నన్ను బ్రతికించింది…

చూడాలి ఇగ వచ్చే యేడు అయినా మమ్మల్ని ఆ భూదేవి తల్లి కరుణించి కాస్త పంట కలిగిస్తే మా కడుపు నిండడం తో పాటు దేశం లోని ప్రజలకు కూడా అన్నం దొరుకుతుంది అని ఆశిస్తున్నా…

– వనీత రెడ్డి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *