నీతి పద్యాలు
నీటి మీద వ్రాత నిన్ను వేధించు
నిజము తెలిసినపుడు బోధపడును
బాధలెన్ని ఉన్న బ్రతుకుతప్పదు గదా
నీటి మూటలవియె నిక్కముగను
పై పై ప్రేమలు పసిడి పూతలు
కపట మాటలు కాల్చు మదిని చేరి
అట్టివారి చెలిమి నాటకము కదా
నీటి మూటలన్న అవియె
తెలియుమయ్యా
రాజకీయమున పలుకు అసత్యములు
పేద జనులు ఉచితపథకాల పడి
ఓటు వేసిన చూపు అసలు రూపు
నీటి మూటలు నాయకుల మాటలే తెలియగాను
ప్రియుని మాటల పడి ప్రేయసి దేహ మర్పంచిన
ఆనక తెలియు వాని అసలు రూపు
వగచిన నేమి ప్రయోజనంబు
బిడ్డా నీటిమూటలన్న ఇవియె తెలియ
కండకావరమున బలవంతులమని
భయ పెట్ట భయముయేల
కుందేలు తెలివిన సింహము పడదా
నీటి మూటలు చూసి భయము ఏల
– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి