నేలవిడిచి సాము

నేలవిడిచి సాము

ఆశ సహజం అత్యాశ అసహజం.

అందని దానికై అర్రులు చాచుటెందుకు

బోర్లపడుటెందుకు.

నక్క అందని ద్రాక్ష పండ్లకై ఎగిరి ఎగిరి

అందక పులుపు అనుకొన్న చందమున

నేలవిడిచి సాము చేయు టెందుకు

ఉన్నదానితో తృప్తి పడక

పొట్టకూటికై తాడుమీద నేలవిడిచి

కర్రపట్టుకు సాము చేయువారితో

పోల్చుకొను టెందుకు.

– రమణ బొమ్మకంటి

Related Posts