నేనే బిచ్చగత్తెనయితే
నేనే గనుక బిచ్చగత్తె నైతే, కోటీశ్వరుల దగ్గరికి వెళ్లి, డబ్బులు అడుక్కుని
అవసరమైన వారికి ఆ డబ్బు పంచి పెడతా
నేనే కనుక బిచ్చగత్తె నైతే, అడుక్కునే వాళ్ళందరినీ, IMPACT ప్రోగ్రాంలో, కూర్చోబెట్టి, అక్కడ కాళ్లు, చేతులు లేని వాళ్ళు కూడా ఎంత కష్టపడి పైకి వస్తున్నారో అనే విషయాన్ని వాళ్ళందరికీ వినిపిస్తా..
ఇక చివరగా
నేనే కనుక బిచ్చగత్తె నయితే ఓటు వేయడం కోసం డబ్బులు తీసుకుంటున్న స్త్రీలందరికీ చింకి చీరలు, బొచ్చెలు ఇచ్చి ఇక అడుక్కోండి అని చెప్తా.
– రామకూరు లక్ష్మి మణి