నేనే నువ్వైతే

నేనే నువ్వైతే

నేనే నువ్వైతే అంతరంగపు
ఆకాంక్షచెబుతుంది
నాదంలా?

మనసు పలికే మధుర భావన నేనైనా నువ్వైనా

మనుషుల మధ్యఅనుభూతుల
చిత్రమైనా

మెదిలే ఆలోచనైనా
కదిలే సమయమైనా
నేనే నువ్వుగా

ముందైనా వెనుకైనా
——–
నడకైనా దారైనా
——–
ప్రేమైనా భాదైన
——-
మాటైనా చాటైనా
——–
ఇష్టమైనా కష్టమైనా
——–
బంధమైనా భాగ్యమైనా
——–
సమస్య అయినా
సంఘర్షణ అయినా
——-

ఊపిరి అయినా ఉప్పెనైనా
——-

ప్రశ్నైనా జవాబు అయినా
——-
ఒంటరైనా జంటగానైనా
——–
ఆరాదనైనా అనుభవమైనా
——-
హద్దులైనా సరిహద్దులైనా
——-
వెలుగైనా నీడైనా
——-
పగలైనా రేయైనా
——-
ఓడినా గెలిచినా
———

నేనేమంత్రినైనా నువ్వేరాజువైనా
ప్రేమ ప్రయాణంలో కుడి ఎడమైనా పొరపాటు లేదు
నువ్వైతేనేమి నేనైతేనేమి
అందులోనేఅసలైన
అర్ధముంది చూడు …….?

– జి జయ

Related Posts