నేను పేదవాడిని

నేను పేదవాడిని

నేను పేదవాడిని

అరిగిన చెప్పు చేదిరిన బొచ్చు

మాసిన గడ్డం మురికి దేహం

ఎండిన డొక్క  చినిగిన గుడ్డ

వాడిన మొఖం ఆకలి స్వరము

పస్థుల భారం కన్నీటి శోకం

గతుకుల అతుకుల మెతుకుల

బతుకుల బాటసారిని

ఆ..నేను  పేదవాడిని….!

-దినుడిని హినుడిని రోగినిని

లోకం దయ లేని అభాగ్యుని

మంచి వాడిని కంపువాడిని

లోకం నిందించే వెర్రివాడిని

ఆరాటాన్ని పోరాటాన్ని అర్భాటాని

ఆశత్వాన్ని అల్పసంతోషాన్ని

మురికివాడలో కంపురోతలో

కరుకుమనుషుల్లో ఇంపుగా..,

బ్రతికే పేదవాడిని

చెల్లని రూపాయి నోటుని

వాడి పడేసే ఆకుని – విస్తరి ఆకుని

నలిగి మాసిన గుడ్డని

దరిద్రపుగొట్టు ఎదవని

లోకం రీతి తెలియని వాడని

భూస్వాములకు పెత్తందారులకు

బల్సిన నా కొడుకులకు

నేనో గులాంగిరిని

-నేనో చెంషాగిరిని

రాజకీయ రాచకీయ నాయకులకి

నేను ఓటుని ఉచిత పథక హామీని

బడా సాబ్  కి వ్యాపారస్తుడుకి

నేనో కూలీని నేనో కూలీని

భారత జనాభా లెక్కల్లో

నేనో పౌరుడిని భారత పౌరుడిని

మొత్తానికి నేనో పేదవాడిని

అణగారిన అగ్నిమంట

అవిరై కన్నీరై కార్చే పేదవాడిని…!

 

జైహింద్…✊️

 

-Saidachary Mandoju

 

మనస్సాక్షి Previous post మనస్సాక్షి
దైవాంశ సంభూతుడు Next post దైవాంశ సంభూతుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *