నేతన్న

నేతన్న

నేతన్న

 

పొట్ట నింపడానికి రైతన్నలు..
ఒళ్లు నింపడానికి నేతన్నలు..
దేశాన్ని కాపాడడానికి సిపాయన్నలు..
దేహాన్ని దాచుకోవడానికి ఈ ..
నేతన్నలు..

వారు దేహాన్ని దాచుకున్న..
కడుపులు మాడ్చుకుంటున్నారు..
రెక్కాడినా డొక్కాడడం లేదు..
అగ్నికి ఆహుతి అవుతున్నారు..
ఆశలు అడియాశలవుతున్నాయి..
కోటి విధ్యలు కూటి కొరకే అంటారు..
అలాంటి విధ్య ఈ రోజు అన్నం..
పెట్టలేక పోతుంది..
నేచిన తాడే ఉరితాడవుతుంది..
వారిని ఆత్మహత్యలు వెంటాడు తున్నాయి..
ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు..
ఆకలి చూపులతో!
వీలైతే ఆదుకుందాం!!
ఆకలి హృదయాలను చల్లార్చుదాం!!

 

-ఉమాదేవి ఎర్రం

తప్పిపోయిన ఆకాశం Previous post తప్పిపోయిన ఆకాశం
నేతన్న Next post నేతన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close