నేటి నా కల

నేటి నా కల

భారతదేశపుకలలపుత్రికలు
సాధించి తీరుతామని
పయనమై పసిడి పథకాలు
పండించి మహిళా శక్తిని
మరొక్క సారి నిరూపించారు!

కామన్వెల్త్ క్రీడల వేదికలో
సాహసమే శ్వాసగా
సంకల్పమే సారధిగా
ఆశలే అడుగులై
ఉత్సహామే ఊపిరిగా
పి .వి సింధు, నిఖత్ జరీనా
తెలుగు తేజాలు
మువ్వన్నెల పతాకానికే
వన్నె తెచ్చిన ముద్దు బిడ్డలు!

విభిన్న శైలిలో
అరుదైన పోరులో
సాహసాల పోటీలో
రికార్డుల వేటలో
శ్రమయే ధ్యేయంగా
విజయమే లక్ష్యంగా
స్వర్ణపతకాలవిజేతలు వీరు!

అనుభూతుల జడిలో
ఆనందాల హాయితో
అద్భుతాల ఆవిష్కరణకు
ప్రపంచపు వేదికలపై
ప్రతిస్టించిన నేటి మేటి మహిళామణులు !

మాతృభూమి ఋణం
తీర్చుకునే అవకాశం
తెలుగు తేజాలకు కలిగిన
అదృష్టం అదే వారి నేటి
మురిపించే కలల సాకారం!
అందుకోండి అందరి
అభినందనలు మరి ..?

– జి జయ

Related Posts