నీజన్మకు తోరణం

నీజన్మకు తోరణం

 నీజన్మకు తోరణం

 

కడుపున మోసే ఓచల్లని తల్లీ
దయజూడమ్మా… ఆడ పిల్లని లోకాన
పాడుచేసే పనిచేయకమ్మా నాపై కోపమా
లేక…శాపమనే దోషమా…కడుపుకోత
కరుణ రసం నీకంటికి కానరాని చీకటి
కోణాలమ్మా….

హృదయఘోష వింటావేకాని…
బండ పగలని మనస్సునా స్వార్థం
నింపుకొని…చీకటి దీపమై వెలిగిన
మా లోకాన్ని పంతపు కోరలతో నలిపేస్తు…
పుట్టుకతోనే పూలు పరిమళిస్తాయనే
నిజాన్ని తెలుసుకోలేక పోతున్నావు…

ప్రేమకు ప్రతి రూపంగా…నీ మధిలో
భావనే చేయని సొంత సోయగం నీదైతే
కొండాకోన జలపాతాలను నేలతల్లి
దాచేను…కోయిలమ్మ పూనకాన్ని పుడమి
తల్లికి వినిపించేను…పసి మొగ్గను నేనమ్మా
పయణమై వస్తున్నా దయతో కరుణకు
తోడవ్వమ్మా….

కరుణ జూపినా కన్నీటితో కాళ్ళు
కడుగుతానమ్మా మాయని మమకారపు
హారాన్నై నీ మెడన ఒదుగుతానమ్మా…
నాపుట్టుకే బరువని పెరగడమే దండగని
మనస్సు కుదుటపడని వరకట్నపు
జ్వాలలతో అగ్నికి సాక్షిగా…నడిపించడ
మెందుకని తల కొరివి పెట్టలేని బంధంగా
దూరమవుతు తల దించుకొంటున్నావు…

నువు నడిచిన దారులలో
నాబతుకునకు నైవేద్యంగా వారధి
కడుతు…మనస్సు కలిపిన గమ్యాన్ని
సూర్యోదయంగా వెలిగిస్తు…వేచిచూచే
తెలియని అమాయకత్వాన్ని నేను…
నీ శిథిలపు పునాదులలో పూడ్చేయకు…
ఆధికే మూలమై అవనికే బిజమై
అడుగడుగున ఆదరించేది ఆడదే కదా….!

ఆ…ఆడదే పాడుదని మీరు
పాడిన పాటలలో రాక్షస గీతాలెందుకు
నీజాడనే తెలియని గుర్తింపునకు
నవమాసాలు మోయాలా…కాదనుకుంటే
కాలం తిరగబడి ప్రణమిల్లినా మీకు రూపం
నిలువదు…కావాలనీ పలకబూనిన ప్రతిభలు
నెరవేరాలని…మీజన్మకు తోరణం కట్టింది
ఆడదే కదా….!!

 

-దేరంగుల భైరవ 

కాలధర్మాను సారాలై Previous post కాలధర్మాను సారాలై
ఘట్టం - ఒకటి Next post సరస్వతీ కటాక్షం రెండో భాగం

One thought on “ నీజన్మకు తోరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close