నిజమైన మగతనం
ఒక అమ్మాయిని మనస్పూర్తిగా ప్రేమించిడం మగతనం కాని మనసులో వేరే ఉద్దేశం ఉంచుకొని ప్రేమ నటించడం మగతనం కాదు
ప్రేమ పెళ్లైనా పెద్దలు చేసిన పెళ్లైనా నమ్మి భార్యగా వచ్చిన అమ్మాయిని తన జీవితంలో సగభాగం ఇచ్చి గౌరవించడం మగతనం కాని ప్రతీదాంట్లో చిన్నచూపు చూడడం తక్కువ చేయడం మగతనం కాదు
ఇల్లాలి శారీరక శ్రమలో భాగం పంచుకోడం మగతనం కాని భార్యతో పడక పంచుకోడం మాత్రమే మగతనం కాదు
తనలోని ప్రేమని భార్యకి అమ్మతనంగా ఇచ్చి పుట్టిన పాపతో ఇద్దరం ఒక్కటని భావన కలిగించటం మగతనం కాని మగతనం నిరూపించుకోడం మరియు శారీరక సుఖం కోసం భార్య ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా బలవంతం చేయడం మగతనం కాదు
ఆడదానిగా పుట్టడం ఆలిగా జీవించడం అదృష్టం అనే భావన భార్యలో కలిగించడం మగతనం కాని ఆడదానిగా పుట్టడం దురదృష్టం లేక ఆడదాని బ్రతుకు ఇంతేనా అనే బాధలు కలిగించేవాడు మగాడు అస్సలు కానే కాదు...
-దీపక్