నిజానికి నిందలెక్కువ

నిజానికి నిందలెక్కువ

ఈ మధ్య ఒక సోషల్ మీడియా లో ఒక ఆవిడ పరిచయమైంది. ఆమెకు అంతకుముందు ఒక ఫ్రెండ్ ఉండేవాడట అతనికి ఇంకో ఫ్రెండ్ ఉండేదట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం అతను ఆమెకి చెప్పాడు అతను ఆమె కన్నా చిన్నవాడు కాబట్టి తన ఫ్యామిలీ గురించి తన సమస్యల గురించి చెప్పుకున్నారు. ఆమె కూడా అతన్ని ఒక స్నేహితుడు లాగా భావించి తన కుటుంబ సమస్యలు కూడా చెప్పుకుంది.

వాళ్ల పరిచయం అలా సాగుతూ ఉండగా అంతకుముందు మాట్లాడే ఆవిడకి ఈ విషయం తెలిసింది అప్పుడు ఆవిడ అతనితో నువ్వు ఆమెతో మాట్లాడకు నువ్వు నాతోనే మాట్లాడాలి అంటూ కండిషన్స్ పెట్టడం మొదలుపెట్టింది. ఇలా కండిషన్స్ పెట్టడానికి ఆమె అతని భార్య కాదు ఇంకొకరి భార్య ఆమెకి పిల్లలు ఉన్నారు అతనికి పిల్లలు ఉన్నారు. స్నేహితుల భావించే ఆమెకి కూడా పిల్లలు ఉన్నారు.

వీరి పరిచయం మూడేళ్ల వరకు సాగింది ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. అయితే అదే సమయంలో ఆమె స్నేహితురాలిగా చెప్పుకుంటున్న ఆవిడతో పిచ్చిపిచ్చిగా మాట్లాడడం నువ్వు అతనితో మాట్లాడకు అని అనడం నువ్వు అతనితో మాట్లాడితే నిన్ను నేను ఏడిపిస్తా అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్లు పెడుతూ ఆమెను చాలా ఒత్తిడికి గురి చేసింది.

పాపం ఆవిడ ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను బాధపడుతూ చాలా డిప్రెషన్కు గురైంది తన ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇంతలో అతన్ని పరిచయం చేసుకున్న ఆవిడ అతని కలిసి అతనితో సంబంధం పెట్టుకొని అతని ద్వారా డబ్బులు తీసుకొని తన అవసరాలు తీర్చుకున్నది..

అతను ఆమె చెప్పిన మాటలు నమ్మాడు. నాకు ఇంట్లో జరగడం లేదు నా భర్త మంచివాడు కాదు తాగుతాడు నా కూతురు ఫీజు కూడా కట్టాలి అంటూ కలవాలి కబుర్లతో అతని దగ్గర దాదాపు 3 లక్షల వరకు తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ వేరే వాళ్ళ దగ్గర అతని గురించి చెడుగా చెప్పడం మొదలు పెట్టింది.

ఆ విషయం తెలిసిన అతను చాలా కోపానికి గురయ్యాడు. ఆమెను తిట్టుకుంటూ మెసేజ్లు పెట్టడం చేశాడు అయితే ఆమె నేను అలా చేయలేదు అంటూ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టడంతో అతను ఎవరో చెప్పిన వారి దగ్గర నుంచి సాక్షాలు తీసుకొని ఆమె ముందు పెట్టాడు దాంతో ఆమె ఇదంతా నేను పెట్టింది కాదు అంటూ తప్పించుకోవాలని చూసింది అప్పుడు అతనికి నిజం తెలిసింది.

ఆమె కేవలం తనతో స్నేహం చేసింది డబ్బు కోసం మాత్రమే అని తన అవసరాలు తీసుకోవడానికి మాత్రమే అని తెలిసింది అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కాబట్టి తను ఆమెను ఏమి చేయలేకపోయాడు. ఆమెని తిడుతూ పోస్ట్లు పెట్టేసరికి, ఆమెకు అండగా మిగిలిన మగవారు వచ్చి అతన్ని తిట్టడం మొదలుపెట్టారు.

అతను అతని స్నేహితురాలు ఆమె గురించి ఎన్ని విధాల చెప్పాలని చూసినా కూడా ఎవరూ నమ్మలేదు ఎందుకంటే ఆమె అందర్నీ మాటలతో బురిడీ కొట్టించింది. ఆమెకు సపోర్ట్ చేసే మగవాళ్ళు కూడా అతనికి ఇచ్చిన ఛాన్స్ మాకు కూడా ఇస్తుందేమో అని ఆశతో ఆమెకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు.

అతను ఆమె అంటే స్నేహితురాలు ఆమె గురించి నిజాలు తెలుసుకొని కళ్ళ ముందు పెట్టిన కూడా చూడకుండా ఆమె వెంట పడుతూ ఆమెకు సపోర్ట్ చేస్తూ, మోసపోయిన ఇతన్ని తిట్టడం మొదలుపెట్టారు..

ఈ నిజాలన్నీ నాకు తెలిసాయి. ముందు నేను కూడా ఆడదాన్నే కాబట్టి ఆమె సమస్య ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నాను ఆమెతో మాట్లాడాను తను అతనిదే తప్పు అని నేనేమీ తప్పు చేయలేదని నాకు చెప్పడంతో నేను తను ఒక ఆడది కాబట్టి అర్థం చేసుకున్నాను అనుకున్నాను కానీ నేను కూడా పప్పులో కాలు వేశానని ఆ తర్వాత కొన్ని విషయాల వల్ల తెలిసింది.

ఇక నేను ఊరుకోలేకపోయాను. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన విషయాలన్నీ బయట పెట్టాను. ఆమెని తిడుతూ నీకు ఒక సంసారం ఉంది అతనికి ఒక సంసారం ఉంది కాబట్టి ఇద్దరి మధ్య గొడవలు అనవసరం ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోండి అంటూ చెప్పాను అతను కాస్త సైలెంట్ అయ్యాడు కానీ ఆవిడ మాత్రం రెచ్చిపోతూ అతన్ని తిడుతూ పోస్టులు పెడుతూనే ఉంది.

ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె సపోర్ట్ చేసే వాళ్లకు కూడా నేను చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను కానీ ఎవరూ నా మాట వినలేదు. పైగా నన్నే ఎన్నో మాటలు అన్నారు నాతో పాటు అతన్ని ఆ స్నేహితురాలిని కూడా ఎన్నో మాటలు మాట్లాడారు మమ్మల్ని టార్గెట్ చేసి పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

అయితే ఒకానొక సమయంలో నాకు అనిపించింది ఏంటంటే, ఆవిడ అన్ని రకాలుగా తిడుతూ పోస్టులు పెడుతున్న కూడా అతను ఆమెను ఏమీ అనకపోవడం ఫోన్లో మాట్లాడినా కూడా ఆమె గురించి మాట్లాడడం చేసేవాడు. నాకు అతను డబల్ గేమ్ ఆడుతున్నాడేమో అని అనిపించింది.

ఎందుకంటే ఒక మగవాడికి అది పెళ్లి అయిన వాడికి ఎలా ఉంటుందంటే నాకోసం ఒక ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకుంటున్నారు అనే విషయం నలుగురికి తెలిస్తే చాతి విరుచుకొని మరీ తిరుగుతాడు. అదొక గొప్ప విషయం లాగా భావిస్తాడు. నేను ఎంతోమంది ఆడవాళ్లను లొంగ తీసుకున్నాను అని బహిరంగంగా అందరితో చెప్పుకొని తిరుగుతాడు. ఇతను కూడా అదే కోవకి చెందిన వాడు అనే ఆలోచన వచ్చింది.

నిజానికి అతను చేస్తున్నది కూడా అదే తన స్నేహితురాలు మెంటల్గా ఒత్తిడికి గురవుతున్న కూడా ఆమెకు సపోర్ట్ చేయకుండా తనను తిడుతున్న ఆమెకి సపోర్ట్ చేయడం చూస్తుంటే అతను మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనిపించింది దాంతో నేను పట్టించుకోవడం మానేశాను. ఇద్దరినీ బ్లాక్ చేసి నా పనేదో నేను చేసుకుంటూ ఆ పరిచయమైన అతని స్నేహితురాలి కి కూడా విషయం అంతా వివరించి చెప్పాను.

కానీ ఆవిడ మాత్రం అసలు నాకు మూడేళ్ల నుంచి తెలుసు నా దగ్గర ఏ విషయాలు దాచడు నాకు అన్ని చెప్తాడు అంటూ అతన్ని గుడ్డిగా నమ్మడం మొదలు పెట్టింది. ఇక నేను ఏమి చేయలేక ఆమెకు చెప్పడం కూడా మానేశాను.

నేను ఒక ఆడదాన్ని అయ్యి ఉండి కూడా ఇంకొక ఆడదాని గురించి ఇలా మాట్లాడడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఇది నిజం జరుగుతున్న నిజం. ఒకరిని బాగు చేయాలని చూసినా ఒకరికి నిజం చెప్పి కళ్ళు తెరిపించాలని చూసినా నిందలు పడేది మనమే అని నాకు అర్థమై నేను పక్కకి తప్పుకున్నాను.

ఇప్పుడు వాళ్లు ఇంకా గొడవలు పడుతూనే ఉన్నారు. ఒకరిని కాకుండా మరొకరు ఘోరంగా పోస్టులు పెట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ రోజంతా అదే పనిలో ఉంటున్నారు. ఈ రోజుల్లో మంచికి చోటు లేదు నిజం చెప్తే నిందలు వేస్తారు తప్ప మనల్ని ఎవరూ నమ్మరు చెడు చెప్తే మాత్రం వెంటనే నమ్మేస్తారు.

ఇది నిజంగా జరిగిన జరుగుతున్న కథ ఇందులోని పాత్రలన్నీ నిజమే అయినా ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళ పేర్లు వాళ్ళు ఎక్కడ గొడవ పడుతున్నారు అనేది చెప్పలేదు కాబట్టి ఇది వారిని ఉద్దేశించి రాసింది కాదు అని గమనించ ప్రార్థన.

– భవ్య చారు

Related Posts