నిలదీత

నిలదీత

అన్యాయాలు, అక్రమాలు దినదినాభివృద్ది చెందుతున్న నా దేశంలో,
చట్టం చేసేవారే , చట్టాన్ని చుట్టంగా వాడుకుంటూ ఉంటే,
కలం ఝుళిపించాల్సిన కవులు కారణాలు వెదుక్కుంటూ ఉంటే,
గొంతెత్తే గళాలు మూగబోయి నాట్యమాడుతుంటే,
నిలదీయలేని మేధావి వర్గం జీవాచ్ఛవంలా పడివుంటే,
ఉడుకు రక్తంతో పిడికిలి బిగించాల్సిన యువత,  జీవచ్చంలా చచ్చుబడివుంటే,
నాటి నాయకుల త్యాగఫలితం  వృధా అవుతుందని భయంలేదా?
యువత మేలుకో, కదన రంగం లోకి కదులు….నీలో కదలిక లేకపోతే
మరో స్వాతంత్ర ఉద్యమం అవసరం అవుతుందేమో ఆలోచించు…

-పోరండ్ల సుధాకర్

Related Posts

1 Comment

Comments are closed.