నిలకడ లేని మనిషి.. మనసు..

నిలకడ లేని మనిషి.. మనసు..

ఆలోచనల తీరు మారు
మనసంతా తికమకల హోరు
పొంత లేని మాటలతో చూపిస్తారు జోరు
వీరికి వీరే పారా హుషారు
ఓ పట్టాన వీరు మారరు
వీరిని కలిగిన వారి గుండె బేజారు

మనసుపై పట్టు కోల్పోయినట్లుంటుంది.
ద్వంద్వ భావాలకు పునాది..
మంచి మాటలు విననంటుంది
వితండవాదాలకు తెర లేపుతుంది..

వెరసి ఇట్టి వారి జీవితం కకా వికలమవుతుంది..

అన్ని జన్మలలోనూ మానవ జన్మ అదృష్టమైనది మరియు పవిత్రమైనది..

అట్టి మానవ జన్మలో నిలకడ కలిగిన మనిషిగా,

మంచి ఆలోచనా భావాలతో తమ జన్మను పరిపూర్ణం చేసుకోవాలని అక్షరలిపి కోరుకుంటుంది…

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts