"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

నిలకడ లేని మనిషి, నిలకడగా నిలబడితే

నిలకడ లేని మనిషి, నిలకడగా నిలబడితే

ఉదయం 8 గంటలు అవుతుంది రంగయ్య 60 ఏళ్లు పైబడ్డ పెద్దాయన కుర్చీలో కూర్చొని భార్య ఇచ్చిన రాగి జావ తాగుతూ టీవీలోని వార్తలు చూస్తున్నాడు ఈ సారి పంటలు బాగానే పండడంతో రైతన్నలు సంబరాలు చేసుకుంటారు అనే వార్త చూసి చాలా మురిసి పోయాడు, ఇంతలో కరెంట్ పోయింది ఛా ఎదవ కరెంట్ ప్రతి అడ్డమైన ప్రోగ్రామ్లు సినిమాలు నాటికలు చూసేప్పుడు ఉంటది కానీ, మా రైతన్నల గురించి కూసింత వార్త సుద్ధమా అంటే ఉండకపాయా దిక్కుమాలిన కరెంట్ దిక్కుమాలిన కరెంట్ అని అనుకుంటూ బయటకి వచ్చాడు.

అది కర్నూల్ దగ్గర మామిధాలపాడు అనే ఓ మారుమూల పల్లెటూరు, ఇక్కడ ప్రతి ఇంటి బయట అరుగులు కచ్చితంగా ఉంటాయి, అయితే ఆ అరుగు మీద కూర్చొని చుట్టూ చూడసాగాడు, మన ఊర్లో పంటలు కూడా ఈసారి బాగానే పండాయి, రాష్ట్రం లో ఇలానే ప్రతి సారి అన్ని పంటలు బాగా పండితే ఎంత బాగుంటుందో కదా అనుకుంటూ, ఈ విషయం మనోళ్ళకు చెప్పాలి అనుకుంటూ వీధి చివరకు వచ్చాడు ఎక్కడ ఒక్కరూ కూడా బయట కనిపించలేదు.

అయితే పక్కనే కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తున్నాడు రంగయ్య. వాళ్ళకైనా చెబుదాంలే అనుకుని దగ్గరకి వెళ్ళే సమయానికి, ఒకడు నేను పెద్దయ్యాక మా అయ్యలాగ రైతుని అవుతా అన్నాడు రంగయ్య మొహం వెలిగిపోయింది. ఆ మరుక్షణమే కాదు కాదు ఇంజనీరు అవుతా అన్నాడు, ఒరి ఇప్పుడే కదరా రైతుని అవుతా అన్నావు అనుకున్నాడు రంగయ్య, అలా అనుకున్నాడో లేదో మళ్ళీ ఆ పిల్లాడు లేదు లేదు నేను పోలీస్ అయితా, అన్నాడు. అక్కడున్న మిగతా ఇద్దరు ఒరేయ్ ఎన్ని చెప్తావు రా ఇదొకటి చెప్పు అన్నాడు లేదు లేదు ఈసారి కచ్చితంగా చెప్తా డాక్టర్ ఆయితా అన్నాడు.

ఇదైన ఫైనల్ ఆ రా? అని ఆ ముగ్గురిలో ఒకడు అడిగాడు లేదు లేదు రా నేను డ్రాయర్ అవుతా అన్నాడు. ఇదంతా వింటున్న ముసలాడికి కోపం వచ్చి రేయ్ ఎంది రా డ్రాయర్ అయితా చెడ్డీ అయితా అనుకుంటా, ఏందిరా నీ పంచాయితీ అన్నాడు. అది డ్రాయరో, చెడ్డినో కాదు తాత బొమ్మలు బాగా ఏసేవొడిని డ్రాయర్ అంటారు తాత అన్నాడు. చాల్లేరా నీ సంబరం ఇందాకా నుంచి చూస్తున్నా అధైతా ఇదైతా అంటున్నావు, ఏందీరా నీకథ అన్నాడు.

అదా ఎం లేదు తాత మేము పెద్దయ్యాక ఎం అవ్వలా అని మాట్లాడుకుంటున్నాం అని ఆ ముగ్గురిలో ఒకడు ఇలా చెప్పాడు వాడు వాళ్ళ నాయిన రైసుమిల్లు నడుపుకుంటా అన్నాడు, నేను మా నాయిన ట్రాక్టర్ తోలుకుంటా పొలం పనులు చేసుకుంటా అని జెప్పినా, వీడెందో డ్రాయర్ అయిత లాయర్ అయిత అంటున్నాడు, చూడు తాత అన్నాడు. బొత్తిగా నిలకడ లేదు తాత వీనికి అధైత ఇదైత అని ఓ ఏచ్చులకు పోతాంటడు అన్నాడు రాము.

రేయ్ మీ పేర్లు ఎం రా అన్నాడు తాత. రోజూ చూస్తావ్ కదా తాత రోజూ పేర్లు చెప్పాలా నేను రాము, వాడు రైసుమిల్ రాజు, ఇదో వీడు విజయ్. పెద్ధోన్ని అయినా కదరా మతిమరుపు వచ్చిందిలే అనుకుంటూ, ఒరేయ్ విజయ్ ఇటు రారా, జీవితంలో స్థిరత్వం చాలా ముఖ్యం రా నిలకడ లేకుండా ఉంటే చాలా కష్టంరా అయ్య.

నేను కూడా నీ మాదిరే 20 ఏండ్లప్పుడు ట్రాక్టర్ తోలాలని పట్టు పట్టి తెచ్చి కొన్నాళ్ళు తొలి తర్వాత తోలబుద్ది కాక పని మీద నిలకడ లేక సానా నష్టానికి ట్రాక్టర్ అమ్మేసిన, తర్వాత పొలం పనులకు పొయ్యి సరిగ్గా పంట వెయ్యక పొలం పనులు సెయ్యక, పంట నాశనం జేసిన మా నాయిన మా అన్న వ్యాపారం పెట్టిస్తే జతగాళ్ళ ఎంబడ పొయ్యి దాన్ని గబ్బులేపిన, ఎం జెయ్యల్నో తెలియకపాయ, డబ్బులు మాత్రం కావాల్ల, కానీ ఈ పనిని సక్రమంగా నిలకడగా జేసుకునేది రాకపోయా…

మల్ల ఆ మధ్య పిల్లనిచ్చిన పదెళ్ళయినాక మా మామ కొల్లఫారం పెట్టిచ్చే నాకు చేత గాదు అని జెప్పినా గూడా వినలే, అట్లే పెట్టించి నాడు, చివరకి అది కూడా నష్టమే మిగిల్చింది రా సిన్నోడా, చివరకి సానాళ్ళు ఇంట్ల ఉండి ఉండి చిరాకు వచ్చింది, మీ అవ్వ ఎంబడి పనికి పోవుడు మొదలెట్టినా, మీ అవ్వకి మాట ఇచ్చిన రా సిన్నోడా ప్రతి రోజూ పనికి వస్తా అని…

నాకు రెండు ఎకరాలు ఉండే మా ముసల్ది నేను ఈ యాపారలు, వేరే వేరే పనులు చేసే ముచ్చట లో పడి పొలాన్నే మర్చిపోయినా మీ అవ్వ దాన్ని నేను నా పొలం పనికి పోయే సరికి 4 ఎకరాలు చేసింది రా, అప్పుడు అర్దం అయ్యింది అయ్యా, ఎదైన పనిని నిలకడగా చేసుకుంటూ పోతే, బాగా సంపాదించుకోవచ్చు అది డబ్బు అయినా, పేరు అయినా అని చెబుతూ ఒరేయ్ విజయ్ గా నీలో నాకు నేనే కనబడినా రా నీ లాగానే నేను ఎందుకు పనికొస్తానో తెలియకుండా, ఎదేదో పనులు చేయాలనుకుని చివరకి ఇట్లా నా పొలం పనులే చేసుకొని చేసుకొని కొడుకులకి కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసి ఆస్తి పంపకాలు చేసి ఇదిగో ఇట్లా ఉన్న అయిదు ఎకరాలు గుత్తకిచ్చి నేను మా ముసల్ది ఉన్నాము. అప్పుడప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చి సుసిపోతా ఉంటారు.

నిలకడగా లేని నా జీవితం ఇలా నిలబడింది అంటే దానికి కారణం మీ అవ్వ రా ప్రతీరోజు ఈ రోజు లేదు అనకుండా పోయ్యేది, అందుకే పదేళ్లలో 2 ఎకరాలను ఒక్కత్తే నాలుగు ఏకారలుగా మార్చింది. ఇది తెల్సుకున్న నేను కూడ మనిషి లాగా మారి నిలకడగా ఉన్నందు వల్లే ఇవ్వాళ్ళ ఇంత సంపాదించినా, కాబట్టి ఒరేయ్ విజయ్ ఎదైన నీదానంగ అలోచించి, నిలకడగా నిర్ణయం తీసుకోరా దుంకులాడాకు ఆడికి ఇడికి అని చెప్పు వస్తారా నాకు ఊర్లో పనుంది అని వెళ్ళిపోయాడు,

ఇదంతా విన్న విజయ్ గాడు ఒరేయ్ రామూ, రాజు నేను కూడా తాత లాగా పొలం పనులకు పొయ్యి మాకున్న 5 ఎకరాలను 25 ఎకరాలుగా మారుస్త అన్నాడు. ఇది విన్న రాము ఒరేయ్ తెలివి తక్కువ నాయాలా ఎదైన నీదానంగా నిలకడగా అలోచించి నిర్ణయం తీసుకోమన్నాడు కదా రా తాత ఎందుకు రా నీకు అంత ఆత్రం అని అరిచాడు.

వెంటనే విజయ్ లేదు రా నాక్కూడా పొలం పనులకు నాన్న ఏంబడి పోవాలని ఉంది రా మీరు ఎడ ఎక్కిరిస్తారో అని చెప్పలేదు రా అన్నాడు. అందులో ఎక్కిరించేదానికి ఎం ఉండాది రా ఎదైనా మన పనే కదా సర్లే ఆడుకుందాం పా అని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు రాము రాజు విజయ్..

నిలకడ లేనంత కాలం ఏ పనిలో ఎక్కువ కాలం నిలబడలేవు, ఒక్కసారి నిలకడగా నిలబడి చూడు నలుగురిలో ఎప్పటికీ నిలిచిపోతావు…..!!!!

సమాప్తం

– అశోక్ కుమార్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *