నిలకడ లేని మనుషులు

నిలకడ లేని మనుషులు

నిలకడ లేని మనుషులు

ఈ మధ్యన స్నేహితుడు బిటెక్ పాస్ అయ్యాడు. వాడిని మంచి కంపెనీ ఆఫర్ ఇచ్చి మరీ తీసుకుంటాను అంటూ ముందుకు వచ్చింది కానీ వాడు మాత్రం నేను వ్యాపారం చేస్తాను అంటూ వ్యాపారంలోకి దిగాడు. కానీ అక్కడ కూడా కొన్ని రోజులు నిలబడలేకపోయాడు.

వ్యాపారానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఆరు నెలల వ్యాపారం చేసి ఆ తర్వాత తన వల్ల కాదని చేతులెత్తేశాడు.. ఈలోపు మళ్లీ అదే కంపెనీ మేము మీకు ఆఫర్ ఇస్తాం అంటూ మళ్ళీ వాడిని పిలిచింది అప్పుడు కూడా వీడు వెళ్లకుండా నేను వేరే కోర్సులు నేర్చుకుంటాను లేదా అమెరికా వెళ్తాను అంటూ హంగామా చేసి అమెరికా వెళ్లడానికి ప్రయత్నం చేశాడు వీసా లో ఏదో పొరపాటు వచ్చింది వెళ్ళకుండానే వెనక్కి వచ్చాడు.

ఆ తర్వాత నాకు వ్యవసాయం అంటే ఇష్టం అంటూ వాళ్ళ నాన్నగారి చేత బలవంతంగా పొలం కొనిపించి ఆర్గానిక్ పంట అంటూ వేయించాడు. కానీ వ్యవసాయంపై సరైన అవగాహన లేకపోవడంతో పంట సరిగ్గా చేతికి రాలేదు దాంతో ఇక లాభం లేదని చేపల చెరువును వేశాడు కానీ అందులో వేసిన చేపలన్నీ చచ్చిపోవడంతో అందులోనూ దివాలా తీసి నెత్తికి చేతులు పెట్టుకున్నాడు.

ఈసారి బండ గురించి తెలిసింది కాబట్టి ఎరువుల దుకాణం పెట్టాలని అనుకున్నాడు. అందులో కూడా వాడికి సరైన అవగాహన లేదు. అలా ఎరువుల దుకాణం పెట్టినా కూడా అందులో కూడా పెద్దగా లాభాలు రాక సలహా కోసం నా దగ్గరికి వచ్చాడు.

వాడు చెప్పిందంతా విని బాగా నవ్వుకున్నాను. నవ్వులాటగా అనిపిస్తుందా అంటూ బేలగా చూడడంతో పాపం అనిపించిన నాకు నీది చంచలమైన మనసు అందుకే నువ్వు దేంట్లో కుదురుగా ఉండలేకపోయావు పైగా నాకే అన్ని తెలుసు అనే నీ అహంకారం కూడా నీ పతనానికి నాంది వేసింది.

నువ్వు గోల్డ్ మెడలిస్ట్. నువ్వు చదివిన చదువుకు నీకు మంచి ఆఫర్ వచ్చింది దాన్ని వదిలేసి నువ్వు ఎడారుల వెంట ప్రయాణం చేశావు. నేను చెప్పినట్టు విను ఇంతకుముందు నిన్ను ఉద్యోగానికి రమ్మన్న కంపెనీ వారు ఇంకా ఆ పోస్టును ఖాళీగానే ఉంచారు ఎందుకంటే నీ విలువ నీకు తెలియదు కానీ బయట వారికి బాగా తెలుసు అందుకే నువ్వు ఎప్పటికైనా వస్తావని ఆశతో ఆ పోస్ట్ అలాగే ఉంచారు.

కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళినా వారు నిన్ను సంతోషంగా ఆహ్వానిస్తారు అంటూ నేను హితబోధ చేయడం వాడు వెళ్లి ఆ కంపెనీ వారితో మాట్లాడడం రెండూ జరిగిపోయాయి వాళ్లు సంతోషంగా ఒప్పుకొని అంతవరకు వాడు లాస్ అయిన మొత్తాన్ని నెల జీతం గా ప్రకటించడం వాడు అసలు నమ్మలేకపోయాడు.

మనిషి నిజానికి సగం బుర్ర తోటే ఆలోచిస్తాడు తన తెలివిని మెదడును పూర్తిగా ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టిస్తాడు కానీ చంచలమైన మనసుతో ఉంటాడు కాబట్టి ఎక్కువ ఆలోచించే శక్తి ఉన్నా ఆలోచించకుండా ఉండిపోతాడు. అదే తెలివితో ఆలోచిస్తే నా స్నేహితుడు ముందుగానే వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకునే వాడు అనవసరంగా రకరకాల వ్యాపారాలు చేసి దివాలా తీసేవాడు కాదు.

– భవ్య చారు

అన్వేషణ ఎపిసోడ్ 2 Previous post అన్వేషణ ఎపిసోడ్ 2
అన్వేషణ ఎపిసోడ్ 3 Next post అన్వేషణ ఎపిసోడ్ 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *