నిన్ను చేరని

నిన్ను చేరని

నా గెలుపు కోసం
నా సుఖం కోసం
నా సంతోషం కోసం
నా ఆశలు నెరవేరాలని
కోరుకుంటూ నా కోసం ఎన్నో
త్యాగాలు చేసి, నాకంటూ ఒక
ఉనికిని ఏర్పరిచి, నా గెలుపు లో
భాగమై , నా ప్రతి కదలికలో తోడువై
నిన్ను నీవు మరచి, నాకోసం శ్రమిస్తూ
నిన్ను నువ్వు పట్టించుకోకుండా నాపై
ఎన్నో ఆశలు పెట్టుకున్న నీ వద్దకు …
ఇదిగో వస్తున్నా… నేను గెలిచాను అంటూ
నా గెలుపును చూపాలని, నా ఆశ నెరవేరిందని అంటూ
గెలుపు గుర్రాలపై నిను చేరాలని పరుగులు తీస్తూ
వస్తున్నా నేనీ ఉదయానా…

– అర్చన

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress