నిప్పు కణిక

నిప్పు కణిక

నిప్పు కణిక
****

నిజాయితీకి మారుపేరు నాన్న
అసలైన నిప్పు కనికవు నీవే నాన్న..

ఈ జీవనానికి జీవితం పోసింది నాన్న..

నీ ప్రేమతో అమ్మ లేని లోటు తెలియకుండా పెంచావు నాన్న

నేను పలికితే ముత్యాల పలుకులు అంటూ మురిసిపోయే వాడివి నాన్న

ఒంటరివైన నీవు ఏనాడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టింది లేదు

నా జీవితం దిద్దడం కోసం పడరాని కష్టాలు పడ్డావు నాన్న

నీ హిత బోధచే నా ఓపికకు సహనానికి శ్రమకు మార్గదర్శివి నీవే నాన్న .

నీ కష్టమే నేటి ఈ జీవితం
సమయం సరిపోకున్న ఆరోగ్యం సహకరించక పోయిన
80 సంవత్సరాల వయసులో కూడా సైకిల్ నీవు ఒక్కడివే తొక్కుకుంటూ

15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా.. యోగక్షేమాల విచారణ కోసం కాలం కాటు వేస్తున్న
నచ్చని వాళ్లు వేలెత్తి చూపిస్తూ దెప్పిపొడుస్తున్న…

కష్టాలు ముంచెత్తుతున్న చెరగని చిరునవ్వుతో కదలని మనసుతో

చొచ్చుకొని వచ్చి నన్ను నా పిల్లల్ని చూసి ఆనందపడే వాడివి నాన్న

నా సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కున్నావు నాన్న..

నీవు ఉన్నంతవరకు నన్ను నా పిల్లల్ని నీ రక్షణ వలయంలో సురక్షితంగా ఉంచావు నాన్న

నీవు లోకం విడిచి వెళ్లిపోయాక నీ రక్షణ వలయం విలువ తెలిసింది నాన్న

అంత చేసిన నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను నాన్న

ఈ జీవితం ముగిసిపోయేంతవరకు నీ నామస్మరణ చేస్తుంటా 🙏

 

-భేతి మాధవిలత

నాన్న గురించి రచన Previous post నాన్న గురించి రచన
నాన్న బాటలో నేను Next post నాన్న బాటలో నేను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close